📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Plane Crash: విమాన ప్రమాదంలో 133 మంది మృతి ?

Author Icon By Sharanya
Updated: June 12, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచివేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI-171) విమానం గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు లండన్ గ్యాట్‌విక్‌కు బయలుదేరి, కేవలం 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 133 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Plane Crash: విమాన ప్రమాదంలో 133 మంది మృతి ?

సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే NDRF, BSF, CISF బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. ఇప్పటివరకు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

మేడే కాల్.. కానీ స్పందన లేకపోవడం ఆందోళన

విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ చేసినట్లు DGCA ప్రకటించింది. ఇది అత్యవసర సంకేతంగా విమాన సంబంధిత ప్రతిస్పందన అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. అయితే ఈ కాల్‌కు ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

పలువురు నేతల స్పందనలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై జార్ఖండ్‌ బీజేపీ నాయకుల దిగ్భ్రాంతి

రక్షణ శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు సంజయ్ సేథ్ గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు సేథ్ మీడియాతో తెలిపారు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపాయి సోరెన్ కూడా ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం జరిగిన కారణంగా జార్ఖండ్ బిజెపి గురువారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది.

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బాబా బైద్యనాథ్‌ను ప్రార్థిస్తున్నాను” అని మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి X లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.

విమాన ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా బాధాకరం. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు ఆవేదన, ఆందోళన ఊహించలేం ఈ కష్టసమయంలో వారికి అండగా నిలుద్దాం.. అత్యవసర రక్షణ, సహాయక చర్యలు చాలా కీలకం – ప్రతి జీవితం ముఖ్యం, ప్రతి సెకను విలువైనది. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొనాలి’ అని అన్నారు.

విమాన ప్రమాదం తనను ఎంతగానో కలచివేసిందని, ఈ దుర్ఘటనలో తమవారిని కోల్పోయిన కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాహుల్ గాంధీ కోరారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడటం చాలా ముఖ్యమని, సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆయన అన్నారు.

విమాన ప్రయాణీకుల జాబితా విడుదల

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787 లండన్‌కు వెళ్తూ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 242 మంది ఉన్నారని ఎయిర్‌లైన్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది.

యూకే ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలను “విధ్వంసకరమైనవి”గా అభివర్ణించారు. “ప్రయాణికులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Read also: Air India: ప్రమాదానికి ముందు ‘మేడే కాల్’ చేసిన పైలట్

#133Dead #AhmedabadCrash #AirIndia #Gujarat #PlaneCrash Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.