దేశాలు ఏవైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా మహిళలు పలురంగాల్లో వివక్షకు గురవుతున్నారు. హైటెక్ నాగరికతలో అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నాం..కానీ స్త్రీ విషయానికి వచ్చేసరికి ఇంకా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీలు దాదాపు అన్నిరంగాల్లోనూ పనిచేస్తున్నారు. సగం రోజు కార్యాలయాల్లోనే ఉంటున్నారు. కానీ వీరికి కావాల్సినన్ని మరుగుదొడ్లు వుండడం లేదు. కొన్నిచోట్ల అయితే నామమాత్రంగా అరకొర సదుపాయాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో మహిళలు టాయిలెట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. (Petition) వందమంది స్త్రీలు ఉంటే రెండుమూడు మాత్రమే టాయిలెట్ల ఉంటున్నాయి. ఇలాంటి ఇబ్బందుల గురించి చర్చించేందుకు కూడా ఇబ్బందే ఎదురవుతుంది. కానీ జపాన్ లో(Japan) మాత్రం మహిళా ఎంపీలు దీనిపై ఏకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి..
Read also: Super Moon 2026: రేపు తొలి పౌర్ణమి
మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై పెద్ద ఎత్తున చర్చ
జపాన్ పార్లమెంట్ లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. (Petition) ప్రస్తుతం దిగువ సభలో 73మంది మహిళా ఎంపీలు ఉండగా..వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ దగ్గర కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిస్థితిపై మహిళా ఎంపీలు తినరవ అసంతృప్తి వ్యక్తం చేశారు. మర్ని టాయిలెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 60 మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జపాన్ ప్రధాని సనాయే టకైచి సహా వివిధ పార్టీలకు చెందిన మహిళాఎంపీలు సంతకాలు చేశారు. పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాలు మాత్రం ఇప్పటికీ పురుష ఆధిపత్య కాలానికి చెందినవిగానే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క టాయిలెట్ తో ఇబ్బంది
జపాన్ పార్లమెంట్ భవనం 1936లో నిర్మించారు. అప్పటికి దేశంలో మహిళలకు ఓటు హక్కు లేదు. రెండో ప్రపంచ యుద్ధంలోజపాన్ ఓటమి తర్వాత 1945 డిసెంబర్ లో మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అనంతరం 1946 ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంట్ కు ఎన్నిక కావడం మొదలైంది. అయితే, కాలం మారినా పార్లమెంట్ భవనంలో మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా లేకపోవడంతో విమర్శలు దారి తీసింది. ఈ సందర్భంగా విపక్ష కానిస్టిట్యూషనల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన యాసుకో కొమియామా మాట్లాడుతూ.. పురుషుల కోసం పార్లమెంట్లో 12 మరుగుదొడ్డు ఉంటే, మహిళల కోసం 9 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రధాన విచారణలు జరిగే ప్లీనరీ హాల్ దగ్గర మాత్రం మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉందని ఆవేదన వ్యక్తుం చేసింది. దాంతో సమావేశాలకు ముందు మహిళలు బాత్రుమ్ కి వెళ్లడానికి పెద్ద ఎత్తున క్యూ కట్టడం.. చాలా అవమానకరమైన పరిస్థితి అని కొమియామా ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: