📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Pak: పాలస్తీనాలో శాంతి..అగ్నిగుండంగా మారిన పాకిస్తాన్

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

“చెరపకురా చెడెవు’ అన్నది నానుడి. ఇతరులను ఇబ్బంది పెడితే మనకూ ఇబ్బంది తప్పదన్నది దాని అర్థం. పాకిస్తాన్‌ పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలను హరిస్తూ వస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌ ఇప్పుడు సొంత దేశాస్తుల ఆందోళనతో అట్టుడుగుతోంది. గాజా(Gaza)లో మరణాలు, ట్రంప్‌ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్‌-ఇ-లబైక్‌ పాకిస్థాన్‌ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ అగ్నిగుండమవుతోంది. గతవారం రోజులుగా దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడసికొట్టడంతో పాటు ఆందోళనకారులు పోలీసులపై తిరగబడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారి సహా పలువురు ఆందోళన కారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యద్ధం ముగిసిందన్న సంతోషంతో పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. పాక్‌లో మాత్రం హింస చెలరేగడం గమనార్హం.

Read Also: Gaza Accord :హమాస్–ఇజ్రాయెల్ బందీ మార్పిడి ప్రారంభం

Pak: పాలస్తీనాలో శాంతి..అగ్నిగుండంగా మారిన పాకిస్తాన్

పోలీసులపై ఆందోళనకారులు కాల్పులు

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా టీఎల్‌పీ లాహోర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ముట్టడించేందుకు యత్నించింది. అయితే ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. పంజాబ్ పోలీస్‌ చీఫ్ ఉస్మాన్ అన్వర్ మాట్లాడుతూ.. పోలీసులపై ఆందోళనకారులు కాల్పులు జరిపారని ఆరోపించారు.దీంతో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారన్నారు.

మంటల్లో దగ్ధమవుతున్న పలు వాహనాలు

పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్‌పీ చీఫ్ సాద్‌ రిజ్వీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులకు విన్నవించినట్లు కనిపిస్తోంది. అధికారులతో చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో తుపాకీ పేలుళ్ల శబ్దం కూడా వినిపించింది. మరొక వీడియోలో.. పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్న దృశ్యాలున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టినట్లు కనిపిస్తోంది. వాటిని తొలగించడంతో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగాయి.

హింసకు దిగడడం ఎందుకు: పాక్ మంత్రి

అయితే టీఎల్‌పీ ప్రదర్శనలపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తోన్న సమయంలో టీఎల్‌పీ ఆందోళనలకు దిగడాన్నిపలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడ శాంతి నెలకొనడం వారికి ఇష్టం లేదేమో అని అభిప్రాయపడుతున్నారు. గాజాలో శాంతి ఒప్పందం నేపథ్యంలో వేడుకలు చేసుకోవాల్సిందిపోయి, హింసకు దిగడడం ఎందుకో అర్థం కావడం లేదని పాక్ మంత్రి తలాల్ చౌధరీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇక నిరసన ప్రారంభం కావడానికే ప్రభుత్వం అతిగా ప్రవర్తించిందని, ముందుగానే రోడ్లను దిగ్బందించిందని దానివల్లే హింస చెలరేగిందని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఏ దేశాన్ని గాజా అని పిలుస్తారు?
గాజా నగరం - పాలస్తీనా
గాజా, తరచుగా గాజా నగరం అని పిలుస్తారు, ఇది పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లోని ఒక నగరం మరియు గాజా గవర్నరేట్ రాజధాని.

గాజా ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది?
గాజా, a పురాతన కాలం నుండి గాజా ఒక సంపన్నమైన ఒయాసిస్ మరియు వాణిజ్య కేంద్రంగా ఉందని చరిత్ర వెల్లడిస్తుంది, ఇది ఏ మధ్యప్రాచ్య సామ్రాజ్యమైనా ఈజిప్టును జయించటానికి మరియు నైలు లోయ ఆధారిత శక్తి అయినా లెవాంట్‌పై దాడి చేయడానికి ఒక ఆధారంలా పనిచేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Geo Politics International Relations Middle East News pakistan crisis Pakistan Unrest Pakistan Violence Palestine Peace Palestine Updates Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.