📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

brain scan : బ్రెయిన్ వేవ్ డేటాకు డబ్బు చెల్లిస్తుంది!: జపాన్ కంపెనీ

Author Icon By Divya Vani M
Updated: July 7, 2025 • 9:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనిషి ఆలోచనలకూ విలువ ఉంటుందా? జపాన్‌లోని టోక్యో నగరంలో ఈ ప్రశ్నకు వినూత్నంగా సమాధానం ఇస్తోంది ఓ సంస్థ. ‘బ్రెయిన్‌వేవ్ టు ది క్రియేషన్’ (‘Brainwave to the Creation’) పేరుతో నడుస్తున్న సంస్థ, మన మెదడులో వచ్చే ఆలోచనల తరంగాలనే కళారూపాల్లోకి మార్చేస్తోంది. వినడానికి అద్భుతంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జపాన్‌ (Japan)లో సంచలనంగా మారింది.టోక్యోలోని చియోడా జిల్లాలో ఉన్న BWTC మెటావర్స్ స్టోర్‌కి వెళ్లి, కేవలం 100 సెకన్లపాటు మెదడును స్కాన్ చేయించుకుంటే చాలు – కంపెనీ రూ. 590 (1,000 జపనీస్ యెన్) చెల్లిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తలపై ఒక ప్రత్యేక పరికరాన్ని పెట్టుకుని ఆ స్కానింగ్‌కి సహకరిస్తే, వారి ఆలోచనలను కంపెనీ డేటాగా మార్చుకుంటుంది.

ఆర్ట్‌గా మారుతున్న మెదడు సంకేతాలు

సేకరించిన బ్రెయిన్‌వేవ్ డేటాను కంపెనీ తక్షణమే ఒక డిజిటల్ ఆర్ట్‌గా రూపుదిస్తుంది. వ్యక్తి ఆలోచించిన అంశం, స్కానింగ్ సమయంలో ఉన్న మానసిక స్థితి ఆధారంగా ప్రత్యేకమైన కళాఖండాలు రూపొందుతాయి. వీటిని ప్రదర్శనకు పెట్టి విక్రయిస్తారు. ఒక్కో ఆర్ట్‌కు ప్రత్యేక ధర ఉంటుంది.

ఆలోచనల విలువ ఆధారంగా ధరలు

ఒక వ్యక్తి ట్రామ్ వీడియో చూస్తుండగా చేసిన స్కానింగ్‌తో వచ్చిన ఆర్ట్‌కు రూ. 8,201 పలికింది. మరో వ్యక్తి ఆహారంపై ఆలోచిస్తుండగా వచ్చిన ఆర్ట్‌కు రూ. 4,608 ధర వచ్చిందట. ఇలా ఒక్కో ఆలోచనకు, ఒక్కో కళాఖండానికి ప్రత్యేక విలువ లభిస్తోంది.

భవిష్యత్‌ ఆర్ట్ మార్కెట్‌కి దారి

ఇప్పటికే BWTC సంస్థ 1,853 మందికి పైగా ప్రజల మెదడు తరంగాలను సేకరించిందని వెల్లడించింది. టోక్యోతో పాటు తైవాన్‌లోనూ ఈ ప్రాజెక్టు పెద్ద విజయాన్ని సాధించింది. భవిష్యత్‌లో మన భావోద్వేగాలే డిజిటల్ మార్కెట్లో కొత్త ఆస్తులుగా మారే అవకాశం ఉంది.

Read Also : Virender Sehwag : డీపీఎల్ వేలంలో సెహ్వాగ్ కొడుకు, కోహ్లీ అన్న కొడుకు

Art Exhibition Based on Thoughts Brain Signals Art BWTC Brain Wave Project Japan Brainwave Art Metaverse Art Japan Tokyo Brain Data Sale

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.