అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచుతూ.. కొత్తగా రూ. 75 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్‌కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు ‘బ్యాగేజ్ రూల్స్, 2026’ కింద చేపట్టగా.. ఫిబ్రవరి 2, 2026 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత బ్యాగేజ్ నిబంధనల్లో ఈ స్థాయిలో మార్పులు రావడం ఇదే మొదటిసారి. ఈ కొత్త నిబంధనలతో ప్రధానంగా లబ్ధి పొందేది భారతీయ పౌరులు అని చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో(Flight) నివసిస్తున్న ఎన్నారైలు.. విమాన మార్గం లేదా సముద్ర మార్గం ద్వారా భారత్‌కు వచ్చే వీరంతా తమ వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన వస్తువులను రూ. 75 వేల విలువ వరకు కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. ఈ పరిమితి ప్రయాణికుడు వెంట తెచ్చుకునే పర్సనల్ బ్యాగేజ్, చెక్-ఇన్ లగేజ్ రెండింటికీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: PriceHike: నెల రోజుల్లోనే గణనీయంగా పెరిగిన నూనె రేట్లు
విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తాయి
ఇంతకు ముందు ఈ డ్యూటీ-ఫ్రీ పరిమితి రూ. 50 వేలు మాత్రమే ఉండేది. పెరిగిన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ఖర్చులు, ప్రయాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పరిమితిని పెంచింది. దీనివల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అదనపు కస్టమ్స్ చార్జీల భయం లేకుండా అవసరమైన వస్తువులను తీసుకురాగలుగుతారు. ఈ మార్పులు భారతీయులకు మాత్రమే కాకుండా, విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తాయి. విదేశీ ప్రయాణికులు ఇప్పుడు రూ. 25 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం రూ. 15 వేలు మాత్రమే ఉండేది. ఈ పెంపు వల్ల భారత్‌కు వచ్చే పర్యాటకులకు మరింత సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బ్యాగేజ్ రూల్స్‌లో బంగారు ఆభరణాల విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. కనీసం ఒక సంవత్సరం పాటు విదేశాల్లో నివసించి భారత్‌కు తిరిగి వస్తున్న భారతీయులు లేదా భారత మూలాలు ఉన్నా విదేశీ పౌరసత్వం కలిగిన వారికి ప్రత్యేక సడలింపులు వర్తిస్తాయి. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు Gold ఆభరణాలను, పురుషులు లేదా ఇతర ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. అయితే ఈ ఆభరణాలు వ్యక్తిగత వినియోగానికి సంబంధించినవై ఉండాలని, వాణిజ్య ఉద్దేశంతో ఉండకూడదని నిబంధనలో పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: