📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Pak: భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణకు పాక్ యత్నం

Author Icon By Vanipushpa
Updated: December 11, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో భారతదేశపు దీర్ఘకాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి పాకిస్తాన్ మరోసారి సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. ప్రాంతీయ సమీకరణాలను మార్చే లక్ష్యంతో, ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న సార్క్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త బ్లాక్ అవసరమని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ (Ishaq dar)చేసిన తాజా వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. చైనా-బంగ్లాదేశ్-పాకిస్తాన్ త్రైపాక్షిక యంత్రాంగాన్ని విస్తరించి, దీన్ని మరిన్ని దేశాలను కలుపుకుంటూ పెద్ద ప్రాంతీయ వేదికగా మార్చాలని ఇస్లామాబాద్ కోరుకుంటోంది. ఈ ప్రతిపాదన ద్వారా దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణం సృష్టించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, భారతదేశాన్ని మినహాయించిన సమూహంలో ఏ దేశం చేరదనే అభిప్రాయమే నిపుణులలో బలంగా వినిపిస్తోంది. సార్క్ 1985లో స్థాపించబడినప్పటి నుంచి దక్షిణాసియా దేశాలను ఒక వేదికపైకి తెచ్చిన ప్రధాన కూటమి. కానీ ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన కొద్దీ ఈ సంస్థ చురుకుదనం కోల్పోయింది.

Read Also:: Denmark: చిన్నారులకు కాన్సర్ ముప్పు తెచ్చిన  వీర్యదాత..

భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాసియాలో కొత్త శక్తి సమీకరణకు పాక్ యత్నం

మరుగన పడిపోయిన సార్క్ సంస్థ

2014లో చివరి శిఖరాగ్ర సమావేశం జరిగిన తర్వాత సార్క్ దాదాపుగా నిలిచిపోయింది. ఉరి దాడి తర్వాత 2016లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సమావేశాన్ని భారత్ బహిష్కరించడంతో సార్క్ సంస్థ పూర్తిగా మరుగన పడిపోయింది. దౌత్యరంగంలో పాకిస్తాన్‌కు దీనివల్ల గట్టి దెబ్బ తగిలింది. ఇదే సమయంలో భారత్ తన దృష్టిని BIMSTEC వైపు మళ్లించి, పాకిస్తాన్‌ని పూర్తిగా పక్కన పెట్టిన ప్రాంతీయ వేదికను బలపరచడం ప్రారంభించడంతో ఇస్లామాబాద్‌కు కొత్త ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంతోనే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ … దక్షిణాసియా ఇకపై జీరో-సమ్ రాజకీయాలు, విభేదాల పునరావృతం లో చిక్కుకోరాదంటూ కొత్త బ్లాక్ అవసరాన్ని ప్రస్తావించారు. దక్షిణాసియాలో సహకారం ఎంతో ముఖ్యమైన విషయం. సార్క్ దేశాల జనాభా రెండు బిలియన్లకు పైగా ఉండటం వలన ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతమిది.

ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం..

కానీ పరస్పర వాణిజ్యం మాత్రం ప్రపంచంలో అత్యల్పస్థాయిలో ఉంది. మొత్తం వాణిజ్యంలో కేవలం 5 శాతం మాత్రమే ఒకదానితో ఒకటి కలిసి చేస్తాయి. అడ్డంకులను తగ్గిస్తే ఈ మొత్తం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే రాజకీయ వైరం, కనెక్టివిటీ లోపం, దౌత్య ఉద్రిక్తతలు సహకారానికి పెద్ద అడ్డంకిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రతిపాదించిన కొత్త బ్లాక్ ఆలోచన.. ఆచరణలో సాధ్యపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భారత జనాభా, ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి, సంక్షోభ సమయంలో ఇచ్చే సాయం వంటి అంశాలు దక్షిణాసియాలో చిన్న దేశాలను భారత్ వైపు నిలబెట్టాయి. నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలు తమ ఆర్థిక కార్యకలాపాల కోసం భారతదేశంపై ఆధారపడటం, కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ చేసిన వ్యాక్సిన్ సరఫరా, సహాయక చర్యలు.. ఇవన్నీ న్యూఢిల్లీని ప్రాంతీయ నాయకుడిగా స్థిరపర్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Diplomatic Developments Google News in Telugu India–Pakistan Relations Latest In telugu news Pakistan Strategy Regional Power Balance Security Dynamics South Asia Geopolitics Strategic Alliances Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.