T20 World Cup: భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్

Read Time:  1 min
T20 World Cup: భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్
FONT SIZE
GET APP

టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) కు సంబంధించి, భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా వెల్లడించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనేదే తమ నిర్ణయమని ఆయన తెలిపారు.బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15న కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

Read Also: AI digital employee : ఆంథ్రోపిక్ షాక్, డిజిటల్ ఉద్యోగిగా ఏఐ వస్తుందా..?

ప్రత్యర్థి జట్టుకు వాకోవర్

భారత్‌లో భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ అందుకు నిరాకరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు షెడ్యూల్ ప్రకారం మైదానంలోకి రాకపోతే, ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ లభిస్తుంది. అంటే, భారత్ ఆడకుండానే 2 పాయింట్లు సాధిస్తుంది.

Pakistan will not play India in T20 World Cup: Shehbaz
Pakistan will not play India in T20 World Cup: Shehbaz

అయితే, క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మ్యాచ్ రద్దు కావడం బ్రాడ్‌కాస్టర్లకు, ఐసీసీకి కోలుకోలేని దెబ్బే. ప్రస్తుతానికి పాక్ జట్టు శ్రీలంక చేరుకున్నప్పటికీ, ఫిబ్రవరి 15న వారు భారత్‌తో తలపడతారా లేదా అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది.పాకిస్థాన్ మ్యాచ్‌ను ఆడకపోతే ఐసీసీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.