పాలనలో ఒక వెలుగు వెలిగి, ఆ పదవి నుంచి దిగిపోయిన వెంటనే అవినీతి కేసులు వెంటాడుతాయి. ఆ కేసులు వారిని జైలు పాలు చేస్తుంది. పాకిస్తాన్ లో మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రులకు నిత్యం ఇవే ఎదురవుతున్నాయి. గత మూడేళ్లుగా మగ్గుతున్న మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ (imran khan) పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్ మాజీ పీఎం, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో ఆవల్పిండిలో ఆడియాల జైలులో వేసింది. ఇటీవల, ఆయన మరణిచాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. చివరకు ఇమ్రాన్ సోదరికి, ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వడంతో ఊహాగానాల తప్పని తేలింది.
Read also: Air Pollution : నగరాన్ని వీడి హిల్ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?
We may never see our father again
తమ తండ్రితో మాట్లాడలేదు.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడు
తమ తండ్రి ఇమ్రాన్ ఖాన్ ను ‘డెత్ సెల్’ లో మానసిక హింసకు గురిచేస్తున్నారని, బహుశా జైలులో ఉన్న తమ తండ్రిని మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అని ఆయన కుమారుడు కాసిం ఖాన్, సులైమూన్ ఇసా ఖాన్ అన్నారు. స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. తాము నెలల తరబడి తమ తండ్రిని చూడలేదని, మాట్లాడలేదని వారు అన్నారు.
మానసికంగా హింసిస్తున్నారు.. కాసిం ఖాన్
ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ మాట్లాడుతూ తన తండ్రి రెండేళ్లుగా ఒంటరి నిర్భందాన్ని ఎదుర్కొంటున్నారని, జైలు లో ఆయనకు మురికి నీరు ఇస్తున్నారని, హెపటైటిస్ తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారని అన్నారు. ఆయనకు ఎలాంటి మానవ సంబంధాలు లేకుండా పూర్తిగా ఏకాంతంలో ఉంచారని ఆరోపించారు. తమ తండ్రిని మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: