📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan : సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తోంది..!: పాకిస్థాన్‌ ఎంపీ

Author Icon By Shobha Rani
Updated: May 9, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక వైపు భారత్‌ దాడులతో పాకిస్థాన్‌ చిగురుటాకులా వణికిపోతుంటే.. మరోవైపు స్వదేశంలో పాక్‌ ప్రభుత్వానికి తల నొప్పి తప్పడం లేదు. భారత్‌ దాడులతో విరుచుకుపడుతుంటే.. పీటీఐ పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran khan)ను విడుదల చేయాలని నిరసనలు చేపట్టారు. తాజాగా పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను తీవ్రంగా విమర్శించారు. షెహబాజ్‌ “పిరికివాడు” అని అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో టిప్పు సుల్తాన్ చెప్పిన ఒక కోట్‌ను ప్రస్తావించారు.. “సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, వారు పోరాడలేరు, వారు యుద్ధంలో ఓడిపోతారు.”

Pakistan : సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తోంది..!: పాకిస్థాన్‌ ఎంపీ

“సరిహద్దులో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారు, కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు, మోడీ పేరును తీసుకోలేనప్పుడు, ముందు వరుసలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి మనం ఏ సందేశం పంపుతున్నాం?” అని షాహిద్‌ (Shahid Ahmed) విమర్శించారు. అంతకుముందు ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని “యా ఖుదా, ఆజ్ బచా లో” (ఓ దేవా, ఈ రోజు మమ్మల్ని రక్షించు) అని వేడుకుంటున్న వీడియో వైరల్‌ అయింది.
మోదీ పేరంటే భయం: ఎంపీ ఆరోపణ
దేశాన్ని చుట్టుముట్టిన అశాంతి గురించి ఆందోళన చెందుతూ ఆయన దేవుడి రక్షణ కోసం ప్రార్థించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్‌ ప్రారంభించిన అత్యంత తీవ్రమైన సైనిక ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్త స్థితికి చేరుకున్నాయి. ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.

Read Also: Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu MP of Pakistan Pakistan: Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The fox is leading the army of lions..!:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.