📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Afgh: ఉగ్రవాదులకు పాక్ భద్రతా బలగాల మధ్య పోరు.. ఆరుగురు మృతి

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌(Pakistan)లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో పాక్ ఆర్మీ కెప్టెన్‌తో సహా ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు పాక్ సైనిక మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎస్‌పీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం కుర్రం జిల్లాలోని డోగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ (ఐబీవో) చేపట్టింది.

Read Also: Donald Trump: టారిఫ్‌ల సడలింపుకై USకు 350B డాలర్లు చెల్లించనున్న దక్షిణ కొరియా

Afgh

భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు

ఈ క్రమంలో భద్రతా దళాలకు, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కి చెందిన ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ పోరులో మియాన్‌వాలీకి చెందిన 24 ఏళ్ల కెప్టెన్ నోమన్ సలీం, మరో ఐదుగురు సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మిగిలిన ఉగ్రవాదుల కోసం ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. విదేశీ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని దేశం నుంచి తుడిచిపెట్టేందుకు ‘అజ్మ్-ఎ-ఇస్తెక్‌హామ్’ పేరిట ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని ఐఎస్‌పీఆర్ స్పష్టం చేసింది.

పెరిగిన ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లలో ఉగ్రదాడులు

2022 చివర్లో పాకిస్థాన్ ప్రభుత్వంతో టీటీపీ కాల్పుల విరమణను రద్దు చేసుకున్నప్పటి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లలో ఉగ్రదాడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో 298 మంది మరణించినట్లు ప్రావిన్స్ కౌంటర్-టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) నివేదిక వెల్లడించింది. భద్రతా దళాలు నిర్వహించిన 2,366 ఆపరేషన్లలో 368 మంది ఉగ్రవాదులు హతమవ్వగా, 1,124 మందిని అరెస్టు చేసినట్లు సీటీడీ పేర్కొంది.

పాకిస్తాన్‌లోని ప్రధాన మతాలు ఏమిటి?
పాకిస్తాన్ యొక్క మతపరమైన ప్రకృతి దృశ్యం | విశ్వాసం యొక్క పటం మరియు ...
పాకిస్తాన్‌లోని ప్రధాన మతం ఇస్లాం, దీనిని దాదాపు 96% జనాభా ఆచరిస్తున్నారు మరియు ఇది రాష్ట్ర మతం.

పాకిస్తాన్‌ను మొదట ఎవరు కనుగొన్నారు?
1947 ఆగస్టు 14న పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ విధంగా, రహమత్ అలీ కల నెరవేరింది మరియు 'పాకిస్తాన్' అనే పదం శాశ్వతంగా ఉనికిలోకి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read also :

Militants Pakistan Pakistan army security forces Telugu News Terror attack Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.