పాకిస్థాన్ (pakistan) తన సొంతదేశంలోనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది. సొంత ప్రజలను ఉగ్రవాదులు హతమారుస్తున్నా, దాడులకు పూనుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. అంతేకాక పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పోషిస్తూ, పొరుగుదేశాలపై ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్నది. ప్రస్తుతం ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీపీటీ) మరింతగా బలాన్ని పుంజుకుంటున్నది. కొత్తఏడాదిలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేసింది. ఇందులో భాగంగానే పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు చేసింది. అయితే ఈ వార్త పాక్ అధికారులను కలవరపెడుతునననది.
Read also: Bangladesh politics : తారిక్ రెహ్మాన్ స్పీచ్‌లో మార్టిన్ లూథర్ కింగ్ ఛాయలు?
Pakistan Terrorism
వచ్చే ఏడాదిలో వైమానిక దళం
2026లో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని టీటీపీ ఓ ప్రకటనలో తెలిపింది. సలీం హక్కానీ నాయకత్వంలో దీన్ని నడపనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రావిన్స్ ల వారీగా మోహరింపులు, మిలిటరీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కశ్మీర్, గిల్గిత్, బాల్టిస్థాన్ తో సహా మరి కొన్ని ప్రావిన్స్ లను తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రణాళిక చేస్తోంది. మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు కూడా చేపట్టింది. ఖైబర్ పఖుంశ్వా, బలోచిస్థాన్ ప్రావిన్స్ లలో కార్యకలాపాలు విస్తరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: