📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pakistan TerrorGroups: భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

Author Icon By Pooja
Updated: December 7, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌పై దాడులు జరిపేందుకు పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు( Pakistan TerrorGroups) కొత్తగా పెద్ద కుట్ర పన్ని ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి అత్యంత ప్రమాదకర ఆర్గనైజేషన్‌ల కీలక కమాండర్లు రహస్య సమావేశం నిర్వహించినట్లు భద్రతా సంస్థలకు సమాచారమందింది. దీంతో దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు.

Read Also: Canada Earthquake: కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

Pakistan TerrorGroups: Massive conspiracy by Pakistani terrorists to attack India

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో నిర్వహించిన “సీరత్-ఎ-నబీ సహీహ్ బుఖారీ” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది జైష్ చీఫ్ మసూద్ అజార్ ప్రధాన స్థావరంగా గుర్తించబడిన ప్రదేశం. కసూరి తరచుగా అక్కడికి వెళ్లిపోయే విషయాన్ని నిఘా వర్గాలు గుర్తిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళా జిహాదీలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

భారత్‌పై కొత్త కుట్ర?

కసూరి–మసూద్(Kasuri–Masood) అజార్ భేటీ భారత్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక దాడులపై( Pakistan TerrorGroups) చర్చించేందుకు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు కూడా ఇదే ప్రాంతంలో కసూరి కనిపించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. రెండు ప్రధాన ఉగ్రవాద సంస్థల అగ్రస్థాయి నేతలు ఒకేచోట సమావేశమైన విషయం భారత భద్రతా వ్యవస్థకు గంభీర సంకేతంగా భావిస్తున్నారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా అధికారులు సూచిస్తున్నారు.

మహిళా జిహాదీల నియామకాల్లో వేగం

జైషే మహ్మద్ ఇప్పుడు మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే దిశగా అడుగులు వేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల కేసులో మహిళా ఉగ్రవాది లింకులు బయటపడటం దీని నేపథ్యంలో చూడాల్సి ఉంది. జైష్‌కు సంబంధించిన మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మోమినాత్’లో కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను చేర్చుకున్నట్లు మసూద్ అజార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. బహవల్పూర్, ముల్తాన్, కరాచీ, సియాల్‌కోట్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల నుండి ఈ నియామకాలు నిర్వహించారు.

ఇందులో చేరిన మహిళలకు ఆన్‌లైన్ జిహాద్ కోర్సులు, 40 నిమిషాల శిక్షణ క్లాసులు అందిస్తున్నారు. ఒక్కో సభ్యురాలు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఫిదాయిన్ దాడులకు మహిళా దళాలను సిద్ధం చేయడం ఈ ప్రయత్నం వెనుక అసలు ఉద్దేశమని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu IndiaSecurityAlert LashkarETaiba Latest News in Telugu TerrorThreat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.