📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Pakistan: ఇంటర్నెట్‌ సమస్యలతో పాక్ ను వదిలి వెళ్తున్న టెక్ దిగ్గజాలు

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌(Pakistan)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే దీనికి గల కారణాలను మైక్రోసాఫ్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే పాక్‌లో ఇంటర్నెట్(Internet) సమస్యల వల్లే మైక్రోసాఫ్ట్ వదిలి వెళ్లిపోయిందని సమాచారం. ఈ సంస్థే కాదు.. గతంలో ఎన్నో సంస్థలు పాక్‌ను వదిలి వెళ్లిపోయాయి.

నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్లేనా..
పాకిస్తాన్‌లోని టెక్ కంపెనీలకు ఇంటర్నెట్ సేవలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫైర్‌వాల్ వ్యవస్థ కారణంగా నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సిస్టమ్స్ కూడా పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ సమస్యలపై పాక్ బిజినెస్ కౌన్సిల్, పాక్ సాఫ్ట్‌వేర్ హౌస్ అసోసియేషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కానీ నెట్‌వర్క్ స్పీడ్ మాత్రం పెంచలేదు. ఫైర్‌వాల్‌లో తరచుగా సమస్యలు రావడం వల్ల చాలా కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లాలని చూస్తున్నాయని కూడా PSHA తెలిపింది. అయితే ఈ నేషనల్ ఫైర్‌వాల్ కారణంగా నెలకు 300 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని PSHA అంచనా వేసింది. ఇప్పటికీ పాకిస్తాన్‌లో 4జీ నెట్‌వర్క్ నడుస్తోందట.

ఇంటర్నెట్‌ సమస్యలతో పాక్ ను వదిలి వెళ్తున్న టెక్ దిగ్గజాలు

ఫైర్‌వాల్ వల్ల దేశానికి నెలకు $300 మిలియన్ నష్టం

పాకిస్తాన్‌లో నెట్‌వర్క్ వల్ల వచ్చిన ఇబ్బందులను తట్టుకోలేక ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలు తమ ఆస్తులను స్థానిక కంపెనీలకు అమ్ముకుని వెళ్లిపోయాయి. ఉబెర్, ఫైజర్, షెల్, ఎలీ ఇల్లీ, సనోఫి, టెలినార్, లొట్టోకెమికల్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా పాకిస్తాన్‌ను విడిచి వెళ్లిపోయాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు టెక్ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్తుంటే.. గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.

వరుసగా కంపెనీల గుడ్‌బై – మైక్రోసాఫ్ట్ కూడా వెళ్లిపోయింది
ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్, ఇటీవల పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలు నిలిపివేసింది.
అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా, నెట్‌వర్క్ ఇబ్బందులే ప్రధాన కారణంగా చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇప్పటికే ఉబెర్, ఫైజర్, షెల్, టెలినార్, సనోఫీ వంటి దిగ్గజాలు కూడా పాకిస్తాన్‌ను వదిలివెళ్లాయి .

పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటానికి ప్రధాన కారణం –

పాకిస్తాన్‌ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు కేవలం 274 MHz స్పెక్ట్రంపైనే నడుస్తున్నాయి, ఇది అవసరమైన సామర్థిక స్థాయికి చాలా తక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా నెట్‌వర్క్‌ మార్గాల్లో తరచూ ట్రాఫిక్ కాంగెషన్ (అందుబాటు సమస్యలు) ఏర్పడుతుండటం వల్ల ఇంటర్నెట్‌ వేగం బాగా తగ్గిపోతుంది.

Read Also:hindi.vaartha.com

Read Also:Brics: ట్రంప్‌ షాక్‌: బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు సుంకాలు

firewall issues Pakistan latest newst Microsoft exits Pakistan Pakistan internet problems Pakistan tech companies crisis PSHA report Pakistan slow internet in Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.