📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: ఇరాన్ న్యూక్లియర్ కు పాకిస్తాన్ మద్దతు

Author Icon By Ramya
Updated: August 4, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pakistan: ఇటీవల ఇశ్రాయెలు, ఇరాన్ దేశాలమధ్య భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండుదేశాలు కాల్పుల ఒప్పందంలో ఉన్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ తో తమకు భవిష్యత్తులో ముప్పుతప్పదని ఇరాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా తన బలాలను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇజ్రాయెల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాకిస్తాన్లో పర్యటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగామ్కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పర్యటనలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలమధ్య వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ భద్రతతో పాటు ఇరాన్ అణుకార్యక్రమంపై చర్చలు జరిగాయి.

https://twitter.com/iamSaharEmami/status/1951665034905428232?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1951665034905428232%7Ctwgr%5E5f2b4411c5012d100862f71afc56f59ec565adb8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Finternational%2Firanian-president-masoud-pezizkian-visits-pakistan-9623590

ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో భేటీ అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ (Iran) కు శాంతియుత అవసరాల కోసం అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఇజ్రాయెల్, అమెరికాల నుండి ఇరాన్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న సమయంలో రావడం గమనార్హం. ఇజ్రాయెల్ చేసిన దాడులను ఖండించిన షెహబాజ్ షరీప్, ఆత్మరక్షణ కోసం ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇరాన్ కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.

పాకిస్తాన్ కూడా అణుదాడి చేస్తుంది: రెజాయ్

గతంలో ఇరాన్ తనపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే, పాకిస్తాన్ కూడా అణుదాడి చేస్తుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ (ఐఆర్జిసి) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజయ్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. అయితే, ఈ ప్రకటనను పాకిస్తాన్ ఖండించింది. మూడవపార్టీ ఘర్షణలతో తమ అణ్వాయుధాలకు ఎలాంటి సంబంధం లేదని పాక్క్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇజ్రాయెల్ దూకుడును ఎదుర్కొనేందుకు ముస్లిం దేశాలు ఐక్యంగా ఉండాలని పాకిస్తాన్ పదేపదే పిలుపునిచ్చింది.

రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు

పాకిస్తాన్లో జరుగుతున్న ఈ సమావేశాలు ఇరాన్కు సైనికపరంగా కాకుండా, రాజకీయంగా మద్దతును కూడగట్టుకోవడానికి ఒక వేదికగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాలమధ్య 10 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యంగా ఈ పర్యటన జరగగా, దీని వెనుక అణుకార్యక్రమంపై ఇరాన్ భద్రతను బలోపేతం చేసుకోవాలని వ్యూహం కూడా దాగి ఉందని తెలుస్తోంది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పర్యటనతో ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహబంధం మరింత బలపడింది. ఈ పరిణామాలు పశ్చిమాసిక ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పర్యటన ఎందుకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంపాదించుకుంది?

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మద్దతును పొందేందుకు ఇరాన్ అధ్యక్షుడు పర్యటించడమే ప్రధాన కారణం. ఈ సందర్భంగా అణు ప్రోగ్రాం, వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిగాయి.

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏ వ్యాఖ్యలు చేశారు?

ఇరాన్కు శాంతియుత అవసరాల కోసం అణు సామర్థ్యం అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని ఆయన బహిరంగంగా మద్దతు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pok-pakistans-intelligence-exposed-with-terrorists-funeral-in-pok/international/525610/

Breaking News Iran nuclear program Iran Pakistan relations Israel Iran conflict latest news Masoud Pezeshkian visit Middle East tensions Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.