📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

India: ఆపరేషన్ సిందూర్​పై చైనాకు పాక్​ మద్దతు

Author Icon By Vanipushpa
Updated: January 3, 2026 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్​(Operation Sindoor) సమయంలో భారత్​, పాక్​ల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామన్న చైనా వాదనను తాజాగా పాకిస్థాన్ సమర్థించింది. చైనా శాంతి కోసం దౌత్యం చేసిందని కితాబు ఇచ్చింది. “భారత్​- పాక్ మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో చైనా నిరంతరం పాకిస్థాన్​తో సంప్రదింపులు జరిపింది. ముఖ్యంగా మే 6 నుంచి 10వ తేదీ వరకు మాతో టచ్​లో ఉంది. బహుశా ఈ ఘర్షణలకు ముందు, ఆ తరువాత కూడా భారత్​తో చైనా సంప్రదింపులు చేసింది. కనుక చాలా సానుకూల వాతావరణంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో చైనా కీలక పాత్ర పోషించింది. ఈ విధంగా ఈ ప్రాంతంలో శాంతి, భద్రతను కాపాడడానికి చైనా దౌత్యం దోహదపడిందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో చైనా చెప్పిన మాటలు పూర్తిగా సరైనవని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్​ అండ్రాబి శనివారం చెప్పారు.

Read Also: Kim Ju Ae: బాహ్య ప్రపంచానికి మళ్లీ కనిపించిన కిమ్ గారాలపట్టి

India: ఆపరేషన్ సిందూర్​పై చైనాకు పాక్​ మద్దతు

మంగళవారం బీజింగ్​లో జరిగిన ఒక సింపోజియంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ కీలక వాఖ్యలు చేశారు. 2025లో చైనా మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ రాజకీయ ఉద్రికత్తల జాబితాలో భారత్​, పాక్​ ఘర్షణ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు, తాహిర్ నిజమేనని తాజాగా వంతపాడారు. గతేడాది మే నెలలో పాకిస్థాన్​తో జరిగిన ఘర్షణను ఇరుదేశాల సైన్యాల మిలిటరీ ఆపరేషన్స్​ డైరెక్టర్స్ జనరల్స్ (డీజీఎంవో) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే పరిష్కరించుకున్నామని భారత్ ఇది వరకే స్పష్టం చేసింది. ఇందులో మూడో పక్షం జోక్యానికి తావులేదని తేల్చిచెప్పింది.

భారత్ వివరణ ఇచ్చినప్పటికీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే (20 కంటే ఎక్కువ సార్లు) తాను భారత్​-పాక్​ల మధ్య ఘర్షణలను ఆపేశానని చెప్పుకుంటున్నారు. అయితే భారత్​ దీనిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. స్పష్టంగా ఇండియా- పాక్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్​ను ట్రంప్​కు ఇవ్వడానికి భారత్​ నిరాకరించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసింది. భారత్ వివరణ ఇచ్చినప్పటికీ, ఆయన మాత్రం ఈ విషయంలో తనకు తాను క్రెడిట్ ఇచ్చుకుంటునే ఉన్నారు. అయితే ఇంతకు ముందు పాకిస్థాన్ ట్రంప్ మాటలకు వంతపాడింది. తాజాగా చైనా కూడా ఘర్షణలను ఆపేందుకు సహకరించిందని చెప్పడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

China Pakistan alliance Diplomatic Tensions Foreign Policy India China Relations Operation Sindoor Pakistan support South Asia politics Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.