📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Terrorist: రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించిన పాక్

Author Icon By Vanipushpa
Updated: July 25, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం(Pahalgam) ఉగ్రదాడి తర్వాత భారత్(India) ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో పాక్లోని 9ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. 2019లో బాలాకోట్ దాడి తర్వాత మూసేసిన లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్రశిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది. ఈ రెండింట్లో ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Terrorist: రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించిన పాక్

నాలుగు తాత్కాలిక టిన్లు
లష్కరే తోయిబా తమ ఉగ్రవాదాల బస కోసం నాలుగు చిన్న తాత్కాలిక టిన్లను కూడా నిర్మించింది పాకిస్థాన్. కొత్తగా ఓ వాల్టవర్ను కూడా నిర్మించింది. వీటిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. లష్కరే తోయిబా ముజఫరాబాద్ లోని సిరియోట్లో జూన్ నుంచే పాత లాంచింగ్ ప్యాడ్ అయిన అబ్దుల్లా బిన్ మసూదు పునరుద్ధరిస్తోందని నిఘా సంస్థలకు సమాచారం అందించింది. జూన్ నాటి చిత్రాలు ఈ లాంచింగ్ ప్యాడ్పై వాచ్ టవర్ నిర్మించినట్లు స్పష్టంగా చూపించాయి.

పీవోకేలో లష్కరే తోయిబా కార్యక్రమాలు

జులై 8న లష్కరే తోయిబాకు చెందిన బహవల్‌పూర్‌ మర్కజ్‌ అధిపతి సైఫుల్లా సైఫ్‌, అలాగే అంతర్జాతీయ ఉగ్రవాది ముజమ్మిల్‌ హష్మీ వాళ్ల సహచరులతో కలిసి చెలా బండి క్యాంప్‌కు వెళ్లారు. అక్కడ చాలా ఏళ్లుగా పీవోకేలో లష్కరే తోయిబా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ కమాండర్ అబూ మువాజ్‌ కూడా వాళ్లతో ఉన్నాడు. మొత్తానికి ఆపరేషన్ సిందూర్‌ తర్వాత లష్కరే తోయిబా నిలిచిపోయిన తమ ఉగ్రకార్యకలాపాలను పునరుద్ధరించింది.  .

క్లుప్తంగా చెప్పాలంటే ఉగ్రవాదం అంటే ఏమిటి?
ఉగ్రవాదం అనేది ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి లేదా ప్రజలను బెదిరించడానికి రూపొందించబడిన చర్య లేదా ముప్పు. దీని ఉద్దేశ్యం రాజకీయ, మతపరమైన లేదా సైద్ధాంతిక లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం.

ఉగ్రవాదం యొక్క ప్రభావాలు ఏమిటి?
ఉగ్రవాదం వ్యక్తులు, సమాజాలు మరియు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే సుదూర మరియు వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంది. ఈ ప్రభావాలను మానసిక, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయంగా విస్తృతంగా వర్గీకరించవచ్చు, ఇవి మానవ హక్కులపై గణనీయమైన పరిణామాలను కలిగి ఉంటాయి.

Read Hindi News : hindi.vaartha.com

Read also : PM Modi’s Milestone: నరేంద్ర మోదీకి అరుదైన రికార్డు

#telugu News Cross-border Terrorism India-Pakistan Relations ISI kashmir Militant Activities National Security Pakistan Terror Camps

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.