📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Pakistan : యుద్ధానికి మేం సిద్ధం.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు

Author Icon By Sudha
Updated: October 17, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌పై పాకిస్థాన్‌ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. సరిహద్దుల్లో భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఓ టెలివిజన్‌ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ.. ‘ఖచ్చితంగా.. దాన్ని తోసిపుచ్చలేము. అందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. పాక్‌ (Pakistan)విషయంలో ఆఫ్ఘాన్‌, భారత్‌ అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. సరిహద్దుల్లో భారత్‌ డర్టీగేమ్స్‌ ఆడుతోందని వ్యాఖ్యానించారు. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Pakistan : యుద్ధానికి మేం సిద్ధం.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు

యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి ఇప్పటికే వ్యూహాలను రూపొందించినట్లు ఈ సందర్భంగా ఖవాజా ఆసిఫ్‌ తెలిపారు. అయితే, యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చర్చించలేనంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఖవాజా ఆసిఫ్‌ ఇప్పటికే భారత్‌ తరఫున ఆఫ్గాన్‌ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?

పాకిస్తాన్‌లో రాష్ట్రాలు కాదు, నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. అవి పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్. అదనంగా, రెండు పరిపాలనా ప్రాంతాలు, గిల్గిట్-బాల్టిస్తాన్ మరియు ఆజాద్ జమ్మూ మరియు కాశ్మీర్, మరియు ఒక సమాఖ్య రాజధాని ప్రాంతం, ఇస్లామాబాద్ ఉన్నాయి.

పాకిస్తాన్‌లో అత్యంత ధనిక రాష్ట్రం ఏది?

స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రకారం పాకిస్తాన్ పరిపాలనా యూనిట్ల జాబితా ఉనికిలో ఉన్న అనేక ప్రాంతీయ GDP ఖాతాలు సాధారణంగా ఆర్థికవేత్తలు చేసిన అంచనాల ప్రకారం ఉంటాయి, జాతీయ GDPకి సంబంధిత యూనిట్ల సహకారం శాతం మరియు కొన్ని వార్షిక అధ్యయనాల ఆధారంగా. పాకిస్తాన్‌లో పంజాబ్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది, జాతీయ GDPకి అత్యధికంగా దోహదపడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Military Readiness Pakistan Pakistan minister South Asia Telugu News war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.