📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Russia: పుతిన్ భారత్ పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్

Author Icon By Vanipushpa
Updated: December 6, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) భారత్ పర్యటన పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రపంచ దేశాలన్నీ రెండు రోజుల పాటూ ఈ పర్యటన వైపే ఆసక్తిగా చూశాయి. పుతిన్ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్ లో కూడా తీవ్రచర్చకు దారి తీసింది.ఇది అక్కడ ప్రజలను నిరాశకు గురి చేసిందని కూడా చెప్పుకోవాలి. దీంతో రష్యా అధ్యక్షుడు తమ దేశం ఎందుకు రారు అనే ప్రశ్నను లేవనెత్తింది. పశ్చిమ దేశాల ఒత్తిడిని కూడా లెక్క చేయకుండా పుతిన్ బారత్ రావడంపై పాకిస్తాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిపై మాట్లాడుతూ రష్యా దగ్గరకు వెళ్ళడం తమ స్నేహితులైన అమెరికాకు ఇష్టం లేదనే అర్ధం వచ్చేట్టుగా మాట్లాడారు. వారి దగ్గరకు వెళ్ళి అడుక్కోవడం అని పదజాలాన్ని కూడా ఉపయోగించారు.

Read Also: RBI: వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

Russia

పాకిస్తాన్ లో ఏముందని పుతిన్ ఇక్కడకు వస్తారు

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్ కు రాపోవడంపై ఆ దేశ జర్నలిస్టులు మరో రకంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ లో ఏముందని పుతిన్ ఇక్కడకు వస్తారని అంటున్నారు. తన జేబులు ఖాళీ చేసుకోవడానికి ఎందుకు వస్తారని తమ దేశ పరిస్థితిని ఎగతాళి చేశారు. పాకిస్తాన్ రక్షణ విశ్లేషకుడు ఖమర్ చీమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ కజ్మీ ఈ వ్యాఖ్యలను చేశారు. పాకిస్తాన్ లో ఏం వ్యాపారం ఉందని వారిని ఇక్కడకు పిలుస్తాము. ఒకవేళ వారు వచ్చినా ఏం చెబుతాం అంటూ కజ్మీ ప్రశ్నించారు. మాకు యుద్ధ విమానాలు ఇవ్వండి, ఇంధనం ఇవ్వండి అని అడుగుతాం. దానికి బదులుగా మనమేం ఇవ్వగలము. భారత్ అంటే డబ్బులు ఇస్తుంది.

పాకిస్తాన్ ఎప్పుడూ పేదరికం, వరదలతో సతమతం

అందుకే పుతిన్ లాంటి వారు మన దేశానికి రారు అని అన్నారు. అంతే కాదు ఆమె షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మరింత ఎగతాళి చేస్తూ కూడా మాట్లాడారు. పాకిస్తాన్ ఎప్పుడూ పేదరికం, వరదలు, భూకంపాలను చూపిస్తుంది. అప్పుడు ఊబిలో కూరుకుపోయిన మన దేశానికి ఎవరు మాత్రం తమ జేబులు ఖాళీ చేసుకోవడానికి వస్తారు అంటూ జర్నలిస్ట్ కజ్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని బాగుచేయడానికి మన ప్రభుత్వం ఏం చేసిందంటూ ఆమె ప్రశ్నించారు. అప్పులతో నడిపిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు భారత్ పై తన అక్కసను వెళ్ళగక్కడానికి పాకిస్తాన్ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు మద్దుతు పలికింది. అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా ప్రకటనను మేము గమనించాము. పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన విషయాలలో చైనాకు మద్దతు ఇస్తూనే ఉంటుంది” అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Diplomatic Response Google News in Telugu India Russia Relations Latest In telugu news Pakistan Reaction Pakistan Russia Tensions Putin India Visit South Asia Geopolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.