గత కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ (Pakistan) ఆక్రమిత కశ్మీర్‌లో ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే శనివారం నిరసనకారులు, పాక్ (Pakistan)భుత్వం మధ్య ఒప్పందం (Agreement) కుదిరింది. హింసాత్మక ఆందోళనల్లో ఇప్పటి వరకు పది మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేకేజేఏఏసీ), ప్రభుత్వం మధ్య సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్కడ హింస మొదలైంది. జేఏఏసీ ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో హింసకు పాల్పడ్డారు. నిరసన సమయంలో వాహనాలకు నిప్పుపెట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో పది మంది మరణించారు.
38 పాయింట్ల ఎజెండాతో జేఏఏసీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత ప్రభుత్వం ఆ డిమాండ్లకు అంగీకరించలేదు. దీంతో ఆందోళన ఉదృతమైంది. పోలీసులు, పౌరులు హింసలో గాయపడ్డారు. అయితే ఇవాళ రెండు వర్గాల మధ్య డీల్ కుదిరినట్లు ప్రకటించారు. కుట్రలు, అవాస్తవాలన్నీ సమసి పోయినట్లు పాకిస్థాన్ (Pakistan)ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. జేఏఏసీతో డీల్ కుదుర్చుకున్న ప్రభుత్వ కమిటీకి ధన్యావాదాలు తెలిపారు. శాంతి, సామరస్యం ఏర్పడడం మంచి సంకేతం అన్నారు.
2025 లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఏ ఒప్పందం కుదిరింది?
నాలుగు రోజుల సైనిక వివాదం తర్వాత, భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ 2025 మే 10న తమ DGMOలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య హాట్‌లైన్ కమ్యూనికేషన్ తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించాయి.
కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏమిటి?
కాల్పుల విరమణ (సంధి అని కూడా పిలుస్తారు), కాల్పుల విరమణ (‘ఓపెన్ ఫైర్’ యొక్క వ్యతిరేక పదం) అని కూడా పిలుస్తారు, ఇది ఒక యుద్ధాన్ని నిలిపివేయడం, దీనిలో ప్రతి వైపు మరొకరు దూకుడు చర్యలను నిలిపివేయడానికి అంగీకరిస్తారు, తరచుగా మూడవ పక్షం మధ్యవర్తిత్వం కారణంగా.
Read hindi news: hindi.vaartha.com
Read Also: