పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, (Shahbaz Sharif) భారత్-పాకిస్తాన్ (India-Pakistan)మధ్య శాంతి చర్చలు ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)సహకారం కోరారు. ఈ విజ్ఞప్తి, రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో, శాంతి సాధనకు అంతర్జాతీయ మద్దతు అవసరాన్ని ప్రతిబింబిస్తుంది.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల నరమేధానికి భారత్.. ప్రతీకారం తీర్చుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. సైనిక చర్యతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాలను భారత్ బట్టబయలు చేస్తోన్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.
శాంతి చర్చలకు సిద్ధం
భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, ఉగ్రవాదం సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా, శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంవత్సరాల తరబడి కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సుముఖతను తెలియజేసింది.
ఈ విషయాన్ని స్వయానా ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లు, వాణిజ్యం, ఇండస్ వాటర్ ట్రీటీ.. వంటి ఇతరత్రా అంశాలపై భారత్ తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తోన్నామని, చర్చల ద్వారానే అది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో షరీఫ్ పాల్గొన్నారు.
ట్రంప్ చొరవ
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపారని ప్రశంసించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకరించారని పేర్కొన్నారు. అలాగే.. భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు ఏర్పాటు కావడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ సహకరించాలని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే నివారించానని, కాల్పుల విరమణ కుదిర్చానని ఇప్పటివరకు 10 వేర్వేరు వేదికల ద్వారా ట్రంప్ ప్రకటించుకున్నారని గుర్తు చేశారు.
షెహబాజ్ షరీఫ్, ట్రంప్ సహకారాన్ని కోరడం ద్వారా, అంతర్జాతీయ మద్దతు పొందాలని ఆశిస్తున్నారు. అయితే, ట్రంప్ పాత్రపై వివాదం, మరియు భారత ప్రభుత్వ ఈ ప్రయత్నానికి సవాళ్లుగా నిలుస్తున్నాయి.
Read Also : AI: ఏఐతో పొంచిఉన్న ప్రమాదం..గూగుల్ డీప్‌మైండ్ సీఈవో