📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: సిందూ జలాల కోసం భారత్‌ని ప్రాధేయపడుతున్న పాక్

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య
ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్(Asim Munir), మరోవైపు పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో(Bilawal Bhutto) భారత్‌పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్‌ని సిందూ జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ చర్యతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమైంది.

Pakistan: సిందూ జలాల కోసం భారత్‌ని ప్రాధేయపడుతున్న పాక్

భారత్‌కు యుద్ధ హెచ్చరికలు చేసిన బిలావల్
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అమెరికా పర్యటనలో భారత్‌పై అణుయుద్ధ బెదిరింపులు చేస్తూ, సింధూ నదిపై భారత్ నిర్మిస్తున్న ఆనకట్టలను క్షిపణులతో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత బిలావల్ భుట్టో సైతం భారత్‌కు యుద్ధ హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్ తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఖరీఫ్ సీజన్ వస్తుడటంతో పాకిస్తాన్ రైతులకు సాగునీరు లేకుండా పోయింది. తాగునీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
సోమవారం పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక కీలక ప్రకటన చేసింది. ఇండస్ జలాల(Indus River) ఒప్పందం తక్షణమే పునరుద్ధరించాలని భారతదేశాన్ని కోరింది. ఆగస్టు 8న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదులపై భారతదేశం నిర్మించబోయే కొత్త రన్-ఆఫ్-రివర్ జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్ ప్రమాణాలను ఈ తీర్పు వివరించిందని ఇస్లామాబాద్ పేర్కొంది.
నీటిని విడుదల చేయాలని కోరిన పాకిస్తాన్
“ఇండస్ జలాల ఒప్పందం సాధారణ విధులను తక్షణమే పునఃప్రారంభించాలని, దాని ఒప్పంద బాధ్యతలను పూర్తిగా, విశ్వసనీయంగా నెరవేర్చాలని మేము భారతదేశాన్ని కోరుతున్నాము” అని విదేశాంగ కార్యాలయం X లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు అనేక లేఖలు రాసింది. సింధూ నదీ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, నీటిని విడుదల చేయాలని కోరింది. అయితే, భారత్ పాకిస్తాన్ అభ్యర్థనలను సున్నితంగా తిరస్కరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకునేంత వరకు ఈ విషయంలో ఎలాంటి చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. “నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు” అని భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్
పహల్గామ్ దాడి తర్వాత భారత్ “ఆపరేషన్ సిందూర్”(Operation Sindoor) ను ప్రారంభించి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో భయపడిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్‌ను వేడుకుంది. అప్పటినుంచి పాకిస్తాన్ ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సింధూ జలాల నిలుపుదల పాక్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసిమ్ మునీర్, బిలావల్ భుట్టోల యుద్ధ బెదిరింపులు ఒకవైపు, నీటి కోసం పాక్ ప్రాధేయపడడం మరోవైపు చూస్తుంటే, పాకిస్తాన్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి?

సింధు జలాల ఒప్పందం ( IWT ) అనేది సింధు నది మరియు దాని ఉపనదులలో లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నీటి-పంపిణీ ఒప్పందం. ఇది కరాచీలో 19 సెప్టెంబర్ 1960న భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరియు పాకిస్తానీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ చేత సంతకం చేయబడింది.

సింధు జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది?

సింధూ జలాల ఒప్పందం ప్రకారం, పశ్చిమ దిశగా పాకిస్థాన్‌ వైపు ప్రవహించే సింధూతోపాటు చీనాబ్‌, జీలం వంటి ప్రధాన ఉప నదులపై భారత్‌కు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. భారత్, పాక్‌ మధ్య 1960, సెప్టెంబరు 19న జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నదీవ్యవస్థ మొత్తం నీటిలో 20% భారతదేశం, 80% పాకిస్థాన్‌ వినియోగించుకోవాలి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

Diplomacy India-Pakistan Relations Indus Waters Treaty Latest News Breaking News Pakistan request South Asia news Water Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.