📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pakistan: పాక్ రిలీజ్ చేసిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆత్మహత్య కారుబాంబు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు ఉగ్రవాదుల ఉచ్చులో ఉన్నారని దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ అనే మహిళా ఉగ్రవాది భారతదేశంలో మహిళా ఉగ్రవాదులకు ఆన్ లైన్ శిక్షణ ఇచ్చే నాయకురాలిగా ఉండడం తెలిసిందే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల ముఠాలో మహిళా ఉగ్రవాదులు కూడా చేరుతుండడం ఆందోళన కలిగించే విషయం. మహిళలు కూడా కరుడుగట్టిన ఉగ్రవాదులతో చేతులు కలుపుతుండడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా నొకుండిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్ సి) ప్రధాన కార్యాలయంపై జరిగిన తాజా దాడి పాకిస్థాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. 

Read Also: Bangladesh: షేక్ హసీనాకు మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

Pakistan Photo of female suicide bomber released by Pakistan

ఈ దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ప్రంట్ (బిఎల్ఎఫ్) బాధ్యత వహించింది. తాజాగా పాకిస్థాన్ (Pakistan) ఎఫ్ సి ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్న మహిళా ఆత్మాహుతి బాంబర్ జరీనా రఫిక్ అలియాస్ తరంగ్ మహో ఫోటోను పాక్ అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆమె ధరించిన జాకెట్ లో మూడు బాంబులు కనిపిస్తున్నాయి. పేలుడు తర్వాత, కాల్పుల మోత చాలాసేపు కొనసాగింది. ఈ ఘటన మొత్తం నొకుండి ప్రాంతాన్ని కుదిపేసింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్యను ఇంకా భద్రతా సంస్థలు ఆధికారికంగా విడుదల చేయలేదు.

బిఎల్ ఎఫ్ యే దాడికి బాధ్యత

దాడి జరిగిన తర్వాత మొదట్లో ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ తర్వాత బలూచిస్థాన్ (Balochistan) లిబరేషన్ ఫ్రంట్ దీనికి బాధ్యత వహించింది. ఈ ఉగ్రసంస్థ ఉప యూనిట్లలో ఒకటి ఈ భారీ దాడిని నిర్వహించిందని పేర్కొంది. నొకుండిలోని రెకో డిక్, సందక్ మైనింగ్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న విదేశీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా పాక్ దర్యాప్తు బృందం దాడికి పాల్పడిన మహిళ ఉగ్రవాది ఫోటోను తాజాగా విడుదల చేసింది. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన మహిళను జరానీ రఫీక్ అలియాస్ తరంగ్ మహోగా గుర్తించారు. ఆమె నొకుండిలోని ఎఫ్ సి ప్రధాన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకుందని తెలిపారు.

ఉగ్రసంస్థలో మహిళలు పాల్గొనడంపై ఆందోళన

కాగా ఉగ్రదాడిలో (terrorist attack) మహిళల ప్రమేయం బయటపడటంతో బలూచ్ మహిళలు ఎందుకు ఇలాంటి ప్రమాదకరమైన దాడుల్లో పాల్గొంటున్నారనే ప్రశ్నను మరోసారి లేవనెత్తింది. స్థానిక మానవ హక్కుల కార్యకర్తలు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఉగ్రసంస్థలో బలూచ్ మహిళలు పాల్గొనడాన్ని ఆత్మహత్య చర్యగా లేదా ఆర్థిక ఒత్తిడి ఫలితంగా చూడకూడదని అన్నారు. ఈ మహిళలు తమ గొంతులను పెంచుతూ, తప్పిపోయిన తమ సోదరీమణులు, సోదరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇందులో చేరుతున్నారని పేర్కొన్నారు.

బలూచిస్థాన్ లో అనేక కుటుంబాలు సంవత్సరాలుగా ఆదృశ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఫిర్యాదు చేస్తున్నాయి. కానీ ఎలాంటి న్యాయం జరగనప్పుడు వాళ్లు ఇలాంటి విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. గత 24 గంటల్లో బలూచిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో దాడులు తీవ్రమయ్యాయి. వేర్పాటువాద గ్రూపులు అనేక ప్రదేశాలలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఇడి పేలుళ్లు, ఆకస్మిక దాడులు, చెక్ పోస్టులపై దాడులు చేశాయి. కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ గ్రూపులు టార్గెట్ చేసుకున్న చోట, ఎప్పుడైనా దాడి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని ఈ దాడులు నిరూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

CounterTerrorism FemaleBomber Google News in Telugu Latest News in Telugu Pakistan PakistaniNews PhotoRelease SecurityAlert SuicideBomber Telugu News Today Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.