📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pakistan: కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

Author Icon By Saritha
Updated: March 17, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Pakistan: Pakistani Airstrike on Kabul Hospital 400 Dead

Pakistan: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. కాబూల్‌లోని ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించడంతో ఆకాశంలోని భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. మరో వీడియాలో భద్రతా సిబ్బంది టార్చ్‌లైట్ వెలుగులో శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీస్తుండగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాబూల్‌లోని డ్రగ్స్ రిహాబిలేషన్‌కు సంబంధించిన ఆస్పత్రిపై సోమవారం రాత్రి 9 గంటలకు పాక్ వైమానిక దాడి జరిపిందని ఆప్గానిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు. ఈ దాడిలో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని పేర్కొన్నారు. ఈ దాడిలో మృతుల సంఖ్య 400కి చేరగా, సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Summer Vacation Plans: యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేయలేదు.. పాకిస్థాన్

ఈ దాడిలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారి చికిత్స కోసం ఉపయోగిస్తున్న పరికరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయని అఫ్గాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా రోగులే ఉన్నారని పేర్కొన్నారు. కాగా, పాక్ దాడిని ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యేనని అభివర్ణించారు.

ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేశారని ఆఫ్గానిస్థాన్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. తాలిబాన్ సైనిక స్థావరాలు, ఆయుద గోదాములు, ఉగ్రవాద మద్దతు కేంద్రాలే లక్ష్యంగా కచ్చితమైన దాడి చేశామని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులకు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండానే జాగ్రత్త పడుతూనే దాడులు చేశామని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Afghanistan Pakistan conflict Kabul explosion videos Kabul hospital Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.