ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ నుంచి భారత్ కు నిరంతరం ముప్పు పొంచి ఉంది. దేశాన్ని మంచిమార్గంలో నడుపుకోలేని ఆ దేశం, ఉగ్రవాదులకు ఆయుధాలను, ఆర్థిక వనరులను సమకూరుస్తున్నది. భారత్ ఆర్థికంగా, భౌగోళింగా ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు పరుగులు తీస్తున్నది. ఇలాంటి దేశాన్ని దెబ్బకొట్టేందుకు ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
Read Also: Delhi Blast: మారణహోమానికి ప్లాన్ వేసిన ఉగ్రవాది డానిష్
అయితే పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ లోని (Pakistan) ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి గురించి తెలిసిందే. అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఢిల్లీ బాంబ్ దాడితో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.భారత సరిహద్దు ఎల్వోసీ చుట్టూ ఉగ్రవాదులు వేచి ఉన్నారని బీఎస్ ఎఫ్ అధికారి ఒకరు చెబుతున్నారు.
పటిష్టంగా భద్రత ఏర్పాటు
పాకిస్తాన్ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, వంద నుంచి 120 మంది దాకా ఉగ్రవాదులు భారత్ లోకి (India) చొరబడడానికి వేచి ఉన్నారని బీఎస్ ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ యాదవ్ తెలిపారు. సరిహద్దు భద్రతాదళంలోని జి బ్రాంచ్ ఈ ఉగ్రవాద స్థావరాలపై నిఘా ఉంచిందని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రత పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు నాలుగుసార్లు ఎమినిది మంది ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని కానీ బీఎస్ఎఫ్ (BSF) వారిని మట్టుబెట్టిందని యాదవ్ పేర్కొన్నారు. భారత సైన్యంతో కలిసి బిఎస్ ఎఫ్ యూనిట్లు నియంత్రణ రేఖ వెంట పాక్ పోస్టులు ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్ లపై సమర్థవంతంగా కాల్పులు జరిపాయని చెప్పుకొచ్చారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: