📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

America: భారత్ అంటే పాకిస్తానుకు భయం..సీఐఏ రిపోర్ట్

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

1993లో సీఐఏ విడుదల చేసిన రహస్య నివేదిక ప్రకారం, పాకిస్థాన్‌కు భారతదేశంపై భయం ఉందని, కశ్మీర్‌ వివాదం కారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆర్థికంగా, సైనికంగా బలహీనంగా ఉన్న పాకిస్థాన్, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తోందని నివేదిక పేర్కొంది.

యుద్ధం జరిగే అవకాశం ఎక్కువ
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థగా భావిస్తున్న, పాకిస్తాన్‌కు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) దాడి తామే చేశామని ప్రకటించుకుంది. దీంతో.. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తుందని భారత ప్రభుత్వం పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. కానీ, భారత్‌ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని చెబుతోంది. ఈ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందనే ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండియాను అందుకోలేని పాకిస్తాన్
ఈ నేపథ్యంలో 1993 నాటి సీఐఏ(సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) రిపోర్ట్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. CIAలో అనుభవజ్ఞుడైన బ్రూస్ రీడెల్ ఆధ్వర్యంలో NIE(నేషనల్‌ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్) రూపొందించింది. అమెరికాకు చెందిన ఈ సీఐఏ అనే పవర్‌ఫుల్‌ సంస్థ 1993లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పరిస్థితులపై అధ్యాయం చేసి ఒక రిపోర్ట్‌ తయారు చేసింది.

అందులో అనేక ఆసక్తికర విషయాలు పేర్కొంది. నిజానికి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఇండియా అంటే పాకిస్థాన్‌కు భయం అని ఆ రిపోర్ట్‌లో సీఐఏ పేర్కొంది. ఒక వేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వస్తే.. అది కశ్మీర్‌ కారణంగా వస్తుందని కూడా సీఐఏ అంచనా వేసింది. ఒక వేళ ఆ పరిస్థితి వచ్చినా.. ఇండియాకు పాకిస్థాన్‌ భయపడుతుందని అని తెలిపింది. అందుకు ఆర్థికంగా, సైనిక పరంగానే బలహీనంగా ఉండటమే కారణం. ఒక వైపు ఇండియా అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ఇండియాను అందుకోలేదని రిపోర్ట్‌ వెల్లడించింది.
కుప్పకూలిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ
1993 నుంచి అదే జరుగుతూ వస్తుంది. ఇండియాను అభివృద్ధిలో అందుకోలేని పాకిస్థాన్‌.. ఆ దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కశ్మీర్‌లోని ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదులతో అనధికారిక పొత్తులు పెట్టుకోవడం వంటివి పాకిస్థాన్‌ చేస్తుందని సీఐఏ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చేస్తుంటే ఆ అంచనా నిజం అవుతోంది. సైనిక బలం పరంగా, ఆర్థికంగా మనల్ని ఎదుర్కొలేని పాకిస్థాన్‌.. మన దేశంలో అల్లర్లు సృష్టించి మనల్ని వెనక్కి లాగేందుకు ఉగ్రవాదులతో జట్టు కడుతోంది.

ఇలాంటి పరిస్థితులు 1993 కంటే ముందు నుంచే ఉన్నా.. అప్పటి భారత ప్రభుత్వాలు ఎంతో సమర్థవంతంగా ఈ సవాళ్లన్ని ఎదుర్కొంటూ స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ఇండియాను అభివృద్ధి దిశగా నడిపించాయని, కానీ పాకిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని రిపోర్ట్‌ వెల్లడించింది.

Read Also :Pahalgam Attack: పహల్గామ్‌ దాడిలో వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

afraid of India Breaking News in Telugu cia-report Google news Google News in Telugu Latest News in Telugu Pakistan is Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.