పాక్ మాజీ (Pakistan) ప్రధాని, పీటీఐ స్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొన్ని వారాలుగా వచ్చిన అనేక వదంతులకు చివరికి ముగింపు పలికింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను 25 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి లభించింది. ఈ సందర్భంగా సోదరి డాక్టర్ ఉజ్మా ఖానమ్‌తో దాదాపు 20 నిమిషాలపాటు మాట్లాడిన ఇమ్రాన్‌ఖాన్ పై(Imran Khan) జరుగుతున్న మానసిక వేధింపుల గురించి బాధ వ్యక్తం చేశారని తెలుస్తోంది.
Read also: కేటీఆర్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం
జైల్లో మానసిక వేధింపులపై ఇమ్రాన్ ఆరోపణలు
జనరల్ అసీం మునీర్(Pakistan) తనను అన్యాయంగా జైలులో ఉంచడానికి కారణమని ఇమ్రాన్ తీవ్రంగా ఆరోపించారు. జైల్లో ఎక్కువసమయం ఏకాంత నిర్బంధంలోనే ఉంచుతున్నారని, ఇది తనపై మానసిక ఒత్తిడి పెంచుతోందని ఆయన పేర్కొన్నట్లు ఉజ్మా మీడియాకు చెప్పారు. “అయితే ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నారు, ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ ఆయనను ఉద్దేశపూర్వకంగా మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోంది” అని ఆమె తెలిపారు. ఇమ్రాన్‌ను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పలుమార్లు కలవడానికి అనుమతించకపోవడంతో సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ నుండి అతను మరణించాడన్న వదంతులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్, రావల్పిండిలలో నిరసనలు చేపట్టారు. పార్టీ నేతలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇమ్రాన్‌ను ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా క్రీడా రంగాన్ని అలరించిన 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 2023 ఆగస్టు నుంచి తోషాఖానా సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: