పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు మళ్లీ భయాందోళనలు రేకెత్తించాయి. ప్రస్తుతం పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు (Sri Lanka national cricket team) పాక్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి భద్రతను కల్పించింది. ఆటగాళ్ల భద్రతను పర్యవేక్షించేందుకు పాకిస్థాన్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నేరుగా రంగంలోకి దిగారు. పీసీబీ చైర్మన్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా లంక ఆటగాళ్లను కలసి, “మీ భద్రతకు ఎటువంటి ప్రమాదం ఉండదు” అంటూ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా, మరో ప్రాంతంలో కేడెట్ కాలేజీపై దాడి ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి.
Read also: RCB: తొక్కిసలాట ప్రభావం.. ఆర్ సిబి సంచలన నిర్ణయం!
Pakistan: వరుస బాంబు దాడులతో పాక్ లో ఉన్న శ్రీలంక జట్టుకి భారీ భద్రత
క్రికెట్ దాదాపు పదేళ్ల పాటు నిలిచిపోయింది
2009లో లాహోర్‌లో లంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ దాదాపు పదేళ్ల పాటు నిలిచిపోయింది. ఆ ఘటన పునరావృతం కాకుండా చూడటానికి పీసీబీ, పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుత పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు రావల్పిండిలో మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం నవంబర్ 17 నుంచి 29 వరకు జింబాబ్వేతో కలిసి టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొననుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: