భారత్-పాక్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం అనంతరం పాకిస్తాన్ సైనికబలాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇందుకోసం సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ వంటి దేశాల సాయాన్ని పొందింది. అంతేకాక అమెరికాను పూర్తిగా తనవైపు తిప్పుకుని, ఓవిధంగా విజయాన్ని పొందింది. ట్రంప్ తో పాకిస్తాన్ పలు ఒప్పందాలను చేసుకున్న విషయం విధితమే. భారతదేశం నుంచి భవిష్యత్తులో ముప్పు పొంచి ఉంటుందని ఊహిస్తున్న పాక్ (Pakistan) సైనిక బలాన్ని పెంచుకుంటుంది. ఇందులో భాగంగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) కు ఆదేశ ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టనున్నట్లుగా తెలుస్తోంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది. దీనికోసం రాజ్యాంగ సవరణను చేపట్టారు. ఈ మేరకు 27వ రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం సెనెట్ లో ప్రవేశపెట్టింది. ఆర్మీ చీఫ్ ను, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోర్సెస్ ను ప్రధాని సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు నియమిస్తారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రధానమంత్రితో చర్చలు జరిపిన అనంతరం నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని నియమిస్తారు.
Read also:సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు
మునీర్ కు కొత్త బాధ్యతలు
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల సమన్వయం కోసం సిడిఎఫ్ అధిపతిగా ఉంటారు. అయితే నవంబరు 28న(Pakistan) అసిమ్ మునీర్ పదవి వివరణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే మునీర్ కు కొత్తగా సృష్టిస్తున్న సిడిఎఫ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మునీర్ కు ఈ అధికారాలు వస్తే పాక్ సైన్యంపై ఆయనకు మరింత అధికారాలు రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: