📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ మృతిపై ప్రపంచవ్యాప్తంగా కలకలం

Author Icon By Pooja
Updated: November 28, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చనిపోయారంటూ గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్ అంతటా ఆందోళనలు, నిరసనలు చుట్టుముట్టాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీం ఖాన్ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు వారాలుగా తన తండ్రిని తమకు చూపించలేదని, ఆయనను డెత్ సెల్‌లో ఉంచారని ఖాసీం ఆరోపించారు. ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తల కారణంగా తమ కుటుంబానికి కూడా అనుమానంగా ఉందని, భయాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Hongkong: ఇంకా ఆరని మంటలు.. 94 కు చేరిన మృతులు!

Global outrage over Imran Khan’s death

ప్రభుత్వంపై ఖాసీం ఖాన్ డిమాండ్

ప్రభుత్వ ప్రకటనలపై నమ్మకం లేని ఖాసీం ఖాన్, (Pakistan)తన తండ్రి బతికున్నట్లుగా తమకు ఆధారాలు చూపించాలని జైలు అధికారులను, పాక్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. గత 845 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారని ఖాసీం ఖాన్ వివరించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయనను తాము కలుసుకోవచ్చునని, కానీ గత నెల రోజుల నుంచి తనను, తన కుటుంబ సభ్యులను ఆయన్ను చూసేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ, కనీసం ఫోన్ కాల్స్ చేయడానికి గానీ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌లో నిరసనలు, తీవ్ర ఆరోపణలు

ఇమ్రాన్ ఖాన్ క్షేమం గురించి తెలుపాలని కోరుతూ పాకిస్తాన్ అంతటా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన సోదరీమణులు జైలు దగ్గరే ఆందోళన చేపట్టగా, వారిపై జైలు అధికారులు, పోలీసులు అమానుషంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వారిని జుట్టు పట్టుకుని లాగి, కొట్టారని నిరసనకారులు తెలిపారు. ఇక పీటీఐ మద్దుతుదారులు మరియు ఇమ్రాన్ ఖాన్ అభిమానులు దేశంలో ఘర్షణలకు దిగుతున్నారు.

అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంపై మౌనం వహిస్తోంది. కేవలం మొక్కుబడిగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఒక ప్రకటన విడుదల చేసి సరిపెట్టింది. కానీ ఒక్కసారి కూడా ఇమ్రాన్ ఖాన్ ను చూపించడానికి, ఆయన వీడియో లేదా మాట్లాడిన మాటలను బయటపెట్టడానికి ప్రయత్నించలేదు. దీంతో ఆయన మరణించారనే నమ్మకం ప్రజల్లో గట్టిపడుతోంది. మరోవైపు, బలూచిస్థాన్ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ (X) ఖాతా వేదికగా… పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ను చంపేశారని ఏకంగా పోస్ట్ పెట్టింది. తన తండ్రి క్షేమం, ఈ అమానవీయ నిర్బంధం పరిణామాలకు పూర్తి చట్టపరమైన, నైతిక అంతర్జాతీయ బాధ్యతను పాకిస్థాన్ ప్రభుత్వం, అధికారులు భరించాల్సి ఉంటుందని కుమారుడు ఖాసీం ఖాన్ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Imran Khan Death Rumours Latest News in Telugu Pakistan political crisis Qasim Khan Plea

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.