📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Pakistan : పాకిస్తాన్‌లో వరదల బీభత్సం ..200 మందికి పైగా మృతి

Author Icon By Sudha
Updated: July 25, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పొరుగు దేశమైన పాకిస్తాన్‌ను (Pakistan) రుతుపవనాలు (Monsoon) తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత నెల రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. వర్ష బీభత్సానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.

Pakistan : పాకిస్తాన్‌లో వరదల బీభత్సం ..200 మందికి పైగా మృతి

పాక్‌ విపత్తు నిర్వహణ సంస్థ పంచుకున్న డేటా ప్రకారం.. జూన్‌ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 126 మంది పిల్లలు ఉన్నారు. పంజాబ్‌లో అత్యధికంగా 144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 63 మంది, సింధ్‌లో 25 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 10 మంది, ఇస్లామాబాద్‌లో ఎనిమిది మంది మరణించారు. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా 628 మంది గాయపడ్డారు. అందులో పంజాబ్‌లో 488, ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 69, సింధ్‌లో 40, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 18, బలూచిస్థాన్‌లో నలుగురు, ఇస్లామాబాద్‌లో ముగ్గురు గాయపడ్డారు. ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గత 24 గంటల్లో 246 ఇళ్లు దెబ్బతిన్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,250కిపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 366 పశువులు మృత్యువాతపడ్డాయి. పంజాబ్‌లో గవర్నర్ సర్దార్ సలీం హైదర్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. పలు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి మించి పెరిగింది. మరోవైపు హరిపూర్‌లోని ఖాన్‌పూర్ తహసీల్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి.

పాకిస్తాన్లో అత్యంత పేద నగరం ఏది?

మొత్తంగా, పాకిస్తాన్‌లోని అత్యంత పేద జిల్లాలు బలూచిస్థాన్ (అంటే, షెరానీ, కోహ్లు, చాఘి మరియు డేరా బుగ్తీ) మరియు సింధ్ (అంటే, బాడిన్, ఉమర్‌కోట్, టాండో ముహమ్మద్ ఖాన్ మరియు థార్‌పార్కర్) ప్రావిన్సులకు చెందినవి; ఏది ఏమైనప్పటికీ, పంజాబ్ జిల్లాలు (అనగా, లాహోర్, రావల్పిండి మరియు గుజ్రాన్‌వాలా) ప్రావిన్స్ సాపేక్షంగా తక్కువ ఆస్తిని కలిగి ఉన్నాయి.

పాకిస్తాన్లో అత్యంత ధనిక నగరం?

పాకిస్తాన్‌లో అతిపెద్ద నగరమైన కరాచీ , నిస్సందేహంగా దేశంలో అత్యంత సంపన్న నగరం. ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రంగా, కరాచీ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.

పాకిస్తాన్లో సురక్షితమైన నగరం ఏది?

పోలీసుల ప్రకారం, ఇస్లామాబాద్ ప్రపంచవ్యాప్తంగా 100 సురక్షితమైన నగరాల్లో ఒకటి మరియు భద్రతా ర్యాంకింగ్‌లో ప్రధాన ప్రపంచ రాజధానులను అధిగమించింది. భద్రతా సూచిక పరంగా ఇస్లామాబాద్ లండన్, న్యూయార్క్, ఓస్లో, సిడ్నీ, మాస్కో, టొరంటో మరియు బార్సిలోనా వంటి ప్రధాన ప్రపంచ నగరాలను అధిగమించిందని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: War: కొనసాగుతున్న థాయిలాండ్, కంబోడియా యుద్ధం.. 11 మంది

200 dead Breaking News Climate Crisis flood disaster Floods Heavy Rains latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.