పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కరాచీ సద్దర్ ప్రాంతంలో ఉన్న గుల్ షాపింగ్ మాల్‌లో అకస్మాత్తుగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 61 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య వంద దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Read Also: US: మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్
పాకిస్తాన్ (Pakistan) లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని గుల్‌ప్లాజాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మాల్‌లో దిగుమతి చేసుకున్న దుస్తులు, ప్లాస్టిక్ గృహోపకరణాలను నిల్వ చేసిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దుబాయ్ క్రాకరీ అనే షాపులో మంటలు మొదలయ్యాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు భవనం అంతా పాకేసిన మంటలను ఆపడానికి దాదాపు 36 గంటలు సమయం పట్టింది.
ఘటన జరిగిన సమయంలో చాలా మంది ప్లాజాలో ఉన్నారు. దుకాణదారులతో పాటూ వినియోగదారులు కూడా అగ్నిలో చిక్కుకుపోయారు. మంటల నుంచి తప్పించుకోవడానికి దుకాణాల షట్టర్లను మూసేశారని.. దాని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
చాలా మందిని గుర్తు పట్టడం కష్టంగా మారింది
అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 30 మంది మృతదేహాలను వెలికి తీశారు. దుబాయ్క్రాకరీ నుంచే వీటన్నింటినీ బయటకు తీశారు. ఈ రోజు మరో మూడు మృతదేహాలను బయటకు తీశారు. వీటిలో చాలా మందిని గుర్తు పట్టడం కష్టంగా మారింది. శరీరాలన్నీ గుర్తు పట్టడానికి వీల్లేకుండా కాలిపోయి ఉన్నాయి.
మరోవైపు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 73 మంది తప్పిపోయిన వారి జాబితాను విడుదల చేసింది. వీరిలో 10 నుండి 69 సంవత్సరాల వయస్సు గల మహిళలు, పిల్లలు, పురుషులు ఉన్నారు. వారిలో 10 నుండి 18 సంవత్సరాల వయస్సు గల, 16 మంది బాలురు ఉన్నారు. వీరందరూ ప్లాజాలోని దుకాణాలలో లేదా షాపింగ్‌లో పనిచేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: