📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan : స్వల్పశ్రేణి క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

Author Icon By Digital
Updated: May 6, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ మరోసారి క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యలకు పాల్పడింది. 120 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ఛేదించగల ‘ఫతా’ భూతల బాలిస్టిక్ క్షిపణిని పాకిస్థాన్ పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని తాము విజయవంతంగా నిర్వహించామని, క్షిపణి నావిగేషన్ వ్యవస్థల పరంగా అత్యాధునికంగా ఉందని, సైనికుల సంసిద్ధతను నిర్ధారించడమే లక్ష్యంగా పరీక్ష నిర్వహించామని పాక్ తెలిపింది. ఈ ప్రయోగ దృశ్యాలను పాక్ ప్రభుత్వ టీవీ ఛానల్ పీటీవీ న్యూస్ ప్రసారం చేసింది.ఇంతకుముందు కూడా పాకిస్థాన్ 450 కి.మీ లక్ష్యం ఛేదించే ‘అద్దాలి’ క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. అలాగే ఏప్రిల్ 24–25, తర్వాత ఏప్రిల్ 26–27, తాజాగా ఏప్రిల్ 30–మే 2 మధ్య కూడా క్షిపణి ప్రయోగాల నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు 120 కి.మీ పరిధిలో లక్ష్యాన్ని ఛేదించే ఫతా సిరీస్ క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ఈ క్రమంలో భారత్‌పై ప్రతీకార చర్యల భయంతో పాకిస్థాన్ తన సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైనిక మోహరింపు చేపడుతున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. గగనతల రక్షణ వ్యవస్థలు, ఫిరంగులు తదితర సమర్థవంతమైన సాయుధ వ్యవస్థల్ని పాక్ సిద్ధం చేస్తోందని సమాచారం.

Pakistan : స్వల్పశ్రేణి క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

Pakistan : స్వల్పశ్రేణి క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

మరోవైపు, ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కీలక చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 23న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం, 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్ హైకమిషన్ అధికారులను ‘పర్సనాలిటా నాన్ గ్రాటా’గా ప్రకటించి, వారంలో భారతదేశం విడిచిపెట్టాలని ఆదేశించింది. అదేవిధంగా సార్క్ వీసా మినహాయింపు పథకం కింద ఉన్న వీసాలను రద్దు చేసింది.ఇంతటితో కాకుండా, పాక్‌కు చెందిన వస్తువులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై తక్షణమే నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు పాక్‌ను అంతర్జాతీయంగా ఒత్తిడిలోకి నెట్టే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, పాక్ ఆర్మీ తరచూ వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతుండడం, దాయాది దేశానికి భారత్ నుంచి వచ్చే భద్రతా సవాళ్లపై పాక్ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ క్షిపణి ప్రయోగం ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని భావిస్తున్నారు.

Read More : Russia: ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో భారతకు రష్యా పూర్తి మద్ధతు

Breaking News in Telugu cross-border conflict Fatah missile Google news Google News in Telugu India Pakistan Tensions Latest News in Telugu Pahalgam Attack Pakistan missile test Paper Telugu News Telugu News Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.