📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Pakistan: ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

Author Icon By Vanipushpa
Updated: January 31, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని స్వయంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్(shahbaz-sharif) అంగీకరించారు. దేశం అప్పుల మీద ఆధారపడి నడుస్తున్న పరిస్థితి తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.పాక్‌కు ఆర్థిక సాయం కోరేందుకు ప్రపంచ దేశాల్లో పర్యటించాల్సి రావడం తనకు సిగ్గుగా ఉందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇలా సహాయం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు.

Read Also: Mine Collapse : ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

Pakistan: ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

నాకు, మునీర్‌కు సిగ్గేస్తోంది..ఆర్మీ చీఫ్‌ను ప్రస్తావించిన ప్రధాని

ఈ విషయంలో తనకే కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కూ సిగ్గుగా అనిపిస్తోందని ప్రధాని స్పష్టంగా చెప్పారు. దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ రుణాలు లేకుండా దేశం నడవలేని స్థితికి చేరడం బాధాకరమని షెహబాజ్ షరీఫ్ అన్నారు. అప్పులు తీసుకొని వాటితో రోజువారీ ఖర్చులు నిర్వహించాల్సిన పరిస్థితి దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రముఖ ఎగుమతిదారులు, వ్యాపారవేత్తల సదస్సులో షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎగుమతులు పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం అత్యవసరమని ఆయన సూచించారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గట్టి ఆర్థిక సంస్కరణలు, అప్పులపై ఆధారాన్ని తగ్గించడం తప్ప మరో మార్గం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Asim Munir army chief Latest News in Telugu Pakistan debt crisis Pakistan economic crisis Pakistan financial instability Pakistan government news Pakistan IMF loans Shahbaz Sharif statement Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.