భారత్-పాకిస్థాన్ లమధ్య హఠాత్తుగా జరిగిన ఆపరేషన్ సిందూర్ యుద్ధం ప్రపంచదేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ యుద్ధ సమయంలో జరిగిన సంఘటనను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ (Army Chief Munir) వ్యాఖ్యానించిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. (Pakistan) భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దైవిక సహాయం పొందినట్లుగా పేర్కొన్నాడు. మునీర్ చేసిన ప్రసంగం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెరపైకి వచ్చాయి.
Read Also: Tulsi Gabbard : ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్

ఖురాన్ వాక్యాన్ని ఉదహరించిన మునీర్
ఇస్లామాబాద్ లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో ఆసిమ్ మునీర్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ కు దైవిక సహాయం లభించినట్లుగా పేర్కొన్నాడు. (Pakistan)అయితే వైరల్ అవుతున్న వీడియోలో తేదీ లేని క్లిప్ వైరల్ అవుతోంది. ఉర్దూలో మాట్లాడిన మునీర్ ‘అల్లాహ్ మీకు సహాయం చేస్తే ఎవరూ మిమ్మల్ని అధిగమించలేరు’ అనే ఖురాన్ వాక్యాన్ని ఉదహరించాడు. శత్రువులు దాడి చేస్తున్న సమయంలో పాకిస్థాన్ కు కనిపించని మద్దతు లభించినల్లుగా పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రవాదులు 26మందిని చంపేశారు. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. మే 7న పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో వందమంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. మే 10న ఇరుదేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: