📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pak: భారత్​ దౌత్యవేత్తలకు గ్యాస్, వాటర్ కట్ చేసిన పాక్

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్(Pakistan) మరోసారి భారత్​​(India) విషయంలో తన వక్రబుద్ధిని చూపించింది. ఇస్లామాబాద్​(Islamabad)లోని భారత దౌత్యవేత్తల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దౌత్యవేత్త(indian ambassador)ల నివాసాలకు నీరు, గ్యాస్ వార్త పత్రికలు వంటి నిత్యావసర వస్తువల సరఫరాను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అంతేకాకుండా భారత రాయబారులపై నిఘాను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. భారత దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.

Pak: భారత్​ దౌత్యవేత్తలకు గ్యాస్, వాటర్ కట్ చేసిన పాక్

భారత దౌత్యవేత్తలకు తాగునీటిని అమ్మవద్దు
మీడియా కథనాలు ప్రకారం, భారత హైకమిషన్ ప్రాంగణంలో గ్యాస్ పైప్​లైన్​లు ఉన్నప్పటికీ సరఫరాను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. అంతకుముందుకు గ్యాస్​ సిలిండర్ల విక్రేతలను కూడా భారత సిబ్బందికి అమ్మకూడదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో భారత రాయబారులు అధిక ధరలకు ప్రత్యామ్నాయాలను వెతకాల్సి వస్తోంది. గ్యాస్​ను మాత్రమే కాకుండా రాయబారి కార్యాలయానికి తాగునీటి అందించే సంస్థకు సరఫరాను నిలిపివేయమని ఆదేశించారు. ఇస్లామాబాద్‌లోని వ్యాపారలకు భారత దౌత్యవేత్తలకు తాగునీటిని అమ్మవద్దని సూచించారు. దీని వల్ల వారు సురక్షితం కాని టాప్ వాటర్ సురక్షితం కానందున్న దౌత్యవేత్తల కుటుంబాలకు సమస్యను కలిగించింది. పత్రికల సరఫరాదారులకు కూడా న్యూస్​ పేపర్స్​ ఇవ్వకూడదని ఆదేశించారు.
వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే
దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించినట్లు కథనాలు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన చర్యగా భారత ఉన్నతాధికారులు అభివర్ణించిట్లుగా సమాచారం. అంతేకాకుండా దౌత్యవేత్తల పనిని, గౌరవాన్ని కాపాడే వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చని కూడా హెచ్చరించారు. అయితే పాక్​ చేసిన పనికి ప్రతీకారంగా దిల్లీలోని పాక్​ దౌత్యవేత్తలకు వార్తాపత్రికలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

1965 లో పాకిస్తాన్ భారతదేశంపై ఎందుకు దాడి చేసింది?

1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం

జమ్మూ కాశ్మీర్‌లోకి సైన్యాన్ని చొరబాట్లను చేసి, భారత పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును రేకెత్తించడానికి పాకిస్తాన్ రూపొందించిన ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించడం ద్వారా భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది.

భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏమిటి?

భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంక్లిష్టమైన మరియు ఎక్కువగా శత్రు సంబంధం ఉంది, ఇది అనేక చారిత్రక మరియు రాజకీయ సంఘటనలలో, ముఖ్యంగా ఆగస్టు 1947లో బ్రిటిష్ ఇండియా విభజనలో పాతుకుపోయింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/bilawal-bhutto-war-threats-against-india/international/529342/

Diplomatic Tensions diplomats gas cut India-Pakistan Relations Latest News Breaking News Latest News in Telugu South Asia news Telugu News Telugu News Today water cut

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.