Pakistan Crisis: ఉద్యోగుల జీతాల్లో 30% వరకు కోత!

Read Time:  1 min
Pakistan Crisis
Pakistan Crisis
FONT SIZE
GET APP

Pakistan Crisis: పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ పరిణామాలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో, పాక్‌లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 55 వరకు పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం ఇప్పుడు తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా సంచలన నిర్ణయం తీసుకుంది.

Read Also:Donald Trump: సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

Pakistan Crisis
Pakistan Crisis: Up to 30% Cut in Employees’ Salaries!

పెట్రోల్ ధరల మంటతో విలవిలలాడుతున్న పాక్

ప్రధానమంత్రి షెహబాబ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ‘పొదుపు చర్యల’కు (Austerity Measures) ఆమోదం లభించింది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు (SOEs), స్వయంప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేసే సిబ్బంది జీతాల్లో 5 శాతం నుండి 30 శాతం వరకు కోత విధించనున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా, క్యాబినెట్ మంత్రులు, సలహాదారుల జీతాలను కూడా వచ్చే రెండు నెలల పాటు ప్రజా సంక్షేమ నిధికి మళ్లించాలని నిర్ణయించారు.

ఆర్థిక సంక్షోభం తీవ్రతను తగ్గించేందుకు విలాసవంతమైన ఖర్చులపై కూడా పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన కోటాలో 50 శాతం కోత విధించడమే కాకుండా, 60 శాతం వాహనాలను రోడ్ల మీద నుండి తొలగించాలని ఆదేశించింది. అలాగే విదేశీ పర్యటనలు, కొత్త వాహనాల కొనుగోలుపై కూడా పూర్తి నిషేధం విధించారు. ఈ కఠిన నిర్ణయాల ద్వారా ఆదా అయ్యే నిధులను సామాన్య ప్రజల ఉపశమనం కోసం కేటాయిస్తామని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.