📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Himanta Biswa Sarma: బ్రహ్మపుత్ర నదీ నీళ్లపై పాక్-చైనా దుష్ప్రచారం

Author Icon By Shobha Rani
Updated: June 3, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ ప్రభుత్వం ఇటీవల సింధూ జలాల ఒప్పందాన్ని ఒకవైపు రద్దు చేయగా, పాకిస్తాన్‌కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గించింది. దీని ప్రభావంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీంతో సాగు కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని అక్కడి రైతులే కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు కీలక డ్యామ్ లలో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు చేరింది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్ర నదీ జలాలపై తప్పుడు ప్రచారానికి తెరలేపింది. చైనా కూడా బ్రహ్మపుత్ర నది జలాలను ఆపేస్తే ఏంచేస్తారంటూ భారత్ ను ప్రశ్నిస్తోంది. తమలాగే భారత్ కూడా ఇబ్బంది పడాల్సివస్తుందని బెదిరింపులకు దిగుతోంది. అయితే, పాక్ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తిప్పికొట్టారు. ఈ అంశంపై ఎక్స్ (X) వేదికగా హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. “ఈ కట్టుకథను భయంతో కాకుండా, వాస్తవాలు, జాతీయ స్పష్టతతో ఛేదిద్దాం,” అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నది భారత్‌లో ప్రవహిస్తూ విస్తరిస్తుందే తప్ప, ఎగువ ప్రాంత నియంత్రణ వల్ల కుంచించుకుపోయే నది కాదని ఆయన వివరించారు. నది మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమేనని, అది కూడా టిబెట్ పీఠభూమిలోని హిమానీనదాలు కరగడం, పరిమిత వర్షపాతం వల్లే వస్తుందని తెలిపారు. మిగిలిన 65 నుంచి 70 శాతం నీరు ఈశాన్య భారతంలో కురిసే రుతుపవన వర్షాలు, ఉపనదుల ద్వారానే బ్రహ్మపుత్రలో చేరుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

Himanta Biswa Sarma: బ్రహ్మపుత్ర నదీ నీళ్లపై పాక్-చైనా దుష్ప్రచారం

బ్రహ్మపుత్ర ప్రవాహం – గణాంకాలతో హిమంత వివరణ
జలసంబంధ గణాంకాలను ఉటంకిస్తూ, చైనా-భారత్ సరిహద్దు వద్ద (ట్యూటింగ్) నది ప్రవాహం సెకనుకు సగటున 2,000 నుంచి 3,000 క్యూబిక్ మీటర్లు ఉండగా, రుతుపవనాల సమయంలో అస్సాంలోకి వచ్చేసరికి ఇది సెకనుకు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుందని శర్మ (Himanta Biswa Sarma) తెలిపారు. ఇది నది ఉద్ధృతిలో భారత్ పాత్ర అధికంగా ఉందని నిరూపిస్తోందన్నారు. “బ్రహ్మపుత్ర నది కోసం భారత్ ఎగువ ప్రాంతాలపై ఆధారపడటం లేదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించాక మరింత బలపడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎన్నేళ్లుగా సింధు జలాల ఒప్పందం కింద లబ్ధి పొందుతూ వస్తోందని, ఇప్పుడు భారత్ ఆ ఒప్పందాన్ని పునరాలోచించి జలవనరులపై తన హక్కులను వినియోగించుకోవడం పాక్‌కు ఆందోళన కలిగిస్తోంది అని హిమంత విమర్శించారు. ఒకవేళ చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినా, అది భారత్‌కు మేలు చేస్తుందేమోనని, ఏటా లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తున్న అస్సాం వరదలు తగ్గుముఖం పట్టవచ్చని శర్మ (Himanta Biswa Sarma) అభిప్రాయపడ్డారు. బ్రహ్మపుత్రను ఆయుధంగా వాడుకుంటామని చైనా అధికారికంగా ఎన్నడూ బెదిరించలేదని, ఈ ప్రచారమంతా కేవలం ఊహాజనిత భయాలను వ్యాప్తి చేయడమేనని కొట్టిపారేశారు. సింధు జలాల ఒప్పందం ద్వారా సుదీర్ఘకాలం లబ్ధి పొందిన పాకిస్థాన్, ఇప్పుడు భారత్ తన నీటి సార్వభౌమాధికారాన్ని తిరిగి పొందుతుండటంతో ‘ఆందోళన చెందుతోందని’ ఆయన విమర్శించారు. బ్రహ్మపుత్ర, సింధూ వంటి అంతర్జాతీయ నదుల విషయంలో భారత్ స్థిరమైన, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. చైనా & పాకిస్థాన్ లాంటి దేశాల ప్రపగండాకు భయపడకుండా, అవగాహనతో స్పందించాల్సిన అవసరం ఉంది.

Read Also: Karachi Jail: కరాచీ జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on Brahmaputra river waters Pakistan-China misinformation Paper Telugu News Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.