ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ మరోసారి నిప్పులు చెరిగింది. గాజా, లెబనాన్ లల్లో హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ లను మట్టుబెట్టుతూ వస్తోన్న నేపథ్యంలో తన వైఖరిని మరోసారి బయటపెట్టుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) పై ఘాటు విమర్శలు చేసింది. ఆయనను అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ గా అభివర్ణించింది. ఆయనను మించిన క్రిమినల్ మరొకరు లేరని ఆరోపించింది. మానవత్వానికి అతిపెద్ద నేరస్థుడిగా పేర్కొంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మానవత్వంపై నమ్మకం ఉంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎత్తుకెళ్లినట్టే నెతన్యాహును అమెరికా కిడ్నాప్ చేయాలని ఆయన డొనాల్డ్ ట్రంప్ కు సవాల్ విసిరారు.
Read Also: Chinese woman arrested : సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!
నెతన్యాహు మానవత్వానికి అతిపెద్ద నేరస్తుడు: పాక్
నెతన్యాహును అపహరించుకుని తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు టర్కీకి కూడా ఉన్నాయని అన్నారు. ఇటువంటి సందర్భం కోసం పాకిస్తానీలు రోజూ ప్రార్థనలు చేస్తోన్నారని ఆసిఫ్ అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సాగించిన దాడుల గురించి ప్రస్తావించారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన క్రూరత్వాలు చరిత్రలో మరే ఘోరానికీ సాటిరాబోవని స్పష్టం చేశారు. గాజా సుదీర్ఘ చరిత్రలో పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ చేసిన అన్యాయం ఏ సమాజమూ చేయలేదని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: