📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Pak Vs Afghan: తాలిబన్ దెబ్బకు తోక ముడిచిన పాక్

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అఫ్గానిస్థాన్,-పాకిస్తాన్(Pak Vs Afghan) సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చగా, సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. తాలిబన్ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే, పాకిస్తానీ(Pakistan) సైనికులు లొంగిపోవడం గమనార్హం. ఈ తాజా ఘర్షణల్లో తమ పౌరులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందని అఫ్గానిస్తాన్ ఆరోపించింది. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. దీనికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ స్పష్టం చేసింది. అర్ధరాత్రి ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ మెరుపుదాడి చేసింది. ఒక్కసారిగా డ్రోన్లతో పాక్‌ ఆర్మీ విరుచుకుపడింది. జజాయ్ మైదాన్, షోర్కో, ఖైబర్‌ ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. పాకిస్తాన్‌ దాడితో అప్రమత్తమైన ఆఫ్గాన్ ఆర్మీ ఎదురు దాడికి దిగింది. పాకిస్తాన్‌ ఔట్‌ పోస్టులను ఆఫ్గాన్ ఆర్మీ పేల్చేసింది. తాలిబన్ సైన్యం, పాక్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.

Read Also: America: భారత్ ను టారిఫ్ లు ఏమీ చేయలేవు: ఐఎంఎఫ్

తాలిబన్ దెబ్బకు తోక ముడిచిన పాక్

కాందహార్ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్ మధ్య యుద్ధం

ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్ మధ్య యుద్ధం ఇప్పుడు కాందహార్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. స్పిన్ బోల్డాక్ గేట్ వద్ద తాలిబన్, పాకిస్తాన్ దళాల మధ్య కాల్పులు జరిగాయి. స్పిన్ బోల్డాక్ గేట్ వద్ద పాకిస్తాన్ సైనికులను తాలిబాన్ యోధులు చుట్టుముట్టారు. దీంతో కేవలం 15 నిమిషాల్లోనే పాక్‌సైన్యం తాలిబన్‌ సైన్యానికి లొంగిపోయింది. తాలిబన్ యోధులు పాకిస్తాన్ సైనికుల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం

ఈ ఉదయం 4 గంటల ప్రాంతంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సరిహద్దు ఫుటేజ్ స్పిన్ బోల్డాక్-చమన్ సరిహద్దు దాటుతున్నట్లు చూపిస్తుంది. స్పిన్ బోల్డాక్ ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్ సరిహద్దులో ఉంది . ఇది ఉత్తరాన కాందహార్ నగరానికి దక్షిణాన పాకిస్తాన్ నగరాలైన చమన్ , క్వెట్టాకు హైవే ద్వారా అనుసంధానించబడి ఉంది. పశ్చిమ- చమన్ సరిహద్దు క్రాసింగ్ నగరానికి ఆగ్నేయంగా ఉంది. పాకిస్తాన్ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే, తాలిబన్లు పాకిస్తానీలను లొంగిపోయేలా చేశారు.

కుర్రంలో ట్యాంకులు ధ్వంసం

తాలిబన్ , -పాకిస్తాన్ యుద్ధం తో కుర్రంలో ట్యాంకులు ధ్వంసం అయ్యాయి. పలు అవుట్‌పోస్టులను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నారు, ఇద్దరు టిటిపి కమాండర్లు హతమయ్యారు. పాకిస్తాన్ పై విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించుకోవడంతో, ఆఫ్ఘన్లు విజయోత్సవాల్లో మునిగిపోయారు. తాజా ఘర్షణలతో సరిహద్దు వెంట భీకర వాతావరణం నెలకొంది. సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి.

ఆఫ్గన్‌ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన పాక్

ఇటీవల కూడా ఇరు దేశాల మధ్య కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో జరిగిన ఘర్షణల్లో 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గానిస్తాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కావడం సరిహద్దు ప్రాంత ప్రజలకు భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, శాంతిని పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మస్లిం దేశాల జోక్యంతో ఆఫ్గన్‌ తాత్కాలికంగా యుద్ధం ఆపింది. అయితే పాకిస్తాన్‌ మాత్రం ఆఫ్గనిస్తాన్‌ను అర్ధరాత్రి దొంగ దెబ్బ తీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

geopolitical tensions Latest News Breaking News Pakistan military Pakistan news South Asia security Taliban impact Taliban influence Taliban Pakistan relations Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.