📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Deal: పాకిస్థాన్-బంగ్లాదేశ్ వైమానికదళ ఒప్పందం.. అప్రమత్తమైన భారత్!

Author Icon By Vanipushpa
Updated: August 2, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్-బంగ్లాదేశ్ (Pakistan-Bangladesh) దేశాల మధ్య రహస్యంగా జరుగుతున్న ఒక వైమానిక ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత(Bharath) భద్రతా వర్గాల్లో కలకలం రేగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు డ్రోన్ వార్‌ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ఇది భారత్‌కు.. ముఖ్యంగా తూర్పు సరిహద్దులో కొత్త భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19 వరకు రహస్యంగా చర్చలు
అధికార వర్గాల నుంచి లీకైన నిఘా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ వైమానిక దళం బంగ్లాదేశ్ వైమానిక దళంతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19 వరకు రహస్యంగా చర్చలు చేపట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రహస్య సమావేశంలో ఇరు దేశాల వైమానిక దళ చీఫ్‌‌‌లు డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ప్రపంచ రాజకీయ పరిస్థితులు మొదలైన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ
ఇది మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ 1 పారా కమాండో బెటాలియన్‌కు ప్రత్యేక ఆయుధాలను బదిలీ చేయడం, బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ ఇవ్వడానికి చర్యలు, పాక్ నుంచి అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణిలను, తుర్కియే నుంచి బంగ్లాదేస్ యుద్ధ ట్యాంకులనూ కొనుగోలు చేయడంపై ఇరు దేశాలు ఒప్పంద కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయంగా కూడా ఇరు దేశాల మధ్య పలు చర్చలు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్‌ను పదవి నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సరిహద్దు ప్రాంతాల్లో మరింత రక్షణ
దీంతో భారత్ అప్రమత్తం అయింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పెంచడం, ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి భారత రక్షణ, సైనిక వర్గాలు చర్యలు తీసుకున్నాయి. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్‌కు తూర్పు సరిహద్దులో ఉంది. పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దులో ఉంది. ఈ రెండు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే భారత్ రెండు వైపుల నుంచి సైనిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు డ్రోన్ టెక్నాలజీని అందించడం ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి .

పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయాయి?
బంగ్లాదేశ్, 1971 - హోలోకాస్ట్ మ్యూజియం హూస్టన్
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాల కలయిక కారణంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయింది.
బంగ్లాదేశ్ భారతదేశానికి మిత్రుడా?
అవును, బంగ్లాదేశ్ మరియు భారతదేశం సాధారణంగా స్నేహపూర్వక మరియు సహకార సంబంధాన్ని పంచుకుంటాయి. కొన్ని సవాళ్లు మరియు వివాదాలు ఉన్నప్పటికీ, రెండు దేశాలు తమ సన్నిహిత సంబంధాల ప్రయోజనాలను గుర్తించి పరస్పర పురోగతికి కృషి చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rbi-indias-forex-reserves-rise-to-698-192-billion-rbi-data/international/524616/

#telugu News Airforce Agreement bangladesh Defence Pact India Security Indian Airforce Latest News Breaking News Military Cooperation Pakistan South Asia Geopolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.