Pakistan Attack: కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

Read Time:  1 min
Pakistan Attack: కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్
FONT SIZE
GET APP

Pakistan Attack: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 400 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది సైనిక చర్య ముసుగులో జరిగిన మారణహోమం అని, పాకిస్థాన్ చర్య క్షమించరానిదని మండిపడింది.

ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. ఇది పిరికిపంద చర్య, క్షమించరాని హింస. సైనిక లక్ష్యం కాని ఒక వైద్య సదుపాయంపై దాడి చేసి ఇంత మంది పౌరుల ప్రాణాలను తీయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం. పాకిస్థాన్ ఇప్పుడు ఒక మారణకాండకు సైనిక చర్య అని పేరు పెట్టే ప్రయత్నం చేస్తోంది అని తన ప్రకటనలో పేర్కొంది.

Read Also: Strait of Hormuz: హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

Pakistan Attack: కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్
Pakistan Attack: India Strongly Condemns Pakistani Attack on Kabul Hospital

ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అండగా ఉంటుంది

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతి, కరుణకు ప్రతీకగా భావించే పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడికి పాల్పడటం మరింత హేయమైన చర్య అని భారత్ పేర్కొంది. ఒక ఆసుపత్రిని, అక్కడి రోగులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మతం, ఏ చట్టం, ఏ నైతికత సమర్థించదు అని వ్యాఖ్యానించింది. 

ఈ విషాద సమయంలో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ సంఘీభావం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపింది. ఈ నేరపూరిత చర్యకు పాల్పడిన వారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీ చేయాలని, ఆఫ్ఘన్ పౌరులపై పాక్‌ చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని భారత్ పిలుపునిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.