📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: పాక్‌ హోంమంత్రి ఇంటిపై దాడి..కాల్పుల్లో ఇద్దరు మృతి

Author Icon By Shobha Rani
Updated: May 22, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ (pakistan)లో సింధు జలాల మళ్లింపుపై రైతులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. గాయాలపాలైన వారినీ వదలకుండా ఆసుపత్రిలోకి వెళ్లి మరీ చేయిచేసుకున్నారు. లాఠీచార్జికి, కాల్పులకు ఆదేశాలిచ్చారనే అనుమానంతో నౌషేరో ఫిరోజ్ జిల్లాలోని మోరో తాలూకాలో ఉన్న సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఇంటిపై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం హోంమంత్రి నివాసానికి నిప్పు పెట్టారు.

Pakistan: పాక్‌ హోంమంత్రి ఇంటిపై దాడి..కాల్పుల్లో ఇద్దరు మృతి

కాల్పుల్లో ఇద్దరు మృతి
ఈ హింసాత్మక ఘటనల్లో ఆందోళనకారులు పలు ట్రక్కులను లూటీ చేసి, ఒక ఆయిల్ ట్యాంకర్‌తో సహా కనీసం మూడు వాహనాలకు నిప్పుపెట్టారు. యూరియా బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు నుంచి బస్తాలను కిందకు విసిరేయగా, కొందరు వాటిని తీసుకెళ్లారు. పెట్రోల్ పంపు కార్యాలయంపై దాడి చేసి నగదు దోచుకున్నారని, పోలీసులపై కర్రలతో దాడి చేశారని స్థానిక మీడియా తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులు, ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు నవాబ్‌షా, సుక్కూర్ నుంచి అదనపు పోలీసు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించగా, పోలీసులు లాఠీచార్జ్‌ మరియు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సంక్షోభం మరింత తీవ్రంగా మారింది.

https://twitter.com/RealRavani/status/1925131417614213348

నిరసనలకు కారణం..
సింధ్ రాష్ట్రంలో తాగు, సాగు నీటికి సింధు నదీ జలాలే ప్రధాన ఆధారం. ఇటీవల నది ప్రవాహం తగ్గడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొంది. ఇదే సమయంలో పంజాబ్ రాష్ట్ర తాగునీటి అవసరాలను తీర్చేందుకు సింధు జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరు కెనాల్ లను నిర్మించాలని తలపెట్టింది. దీంతో సింధ్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింధు జలాలను మళ్లిస్తే తాము తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుందని, తమ పంట పొలాలు బీడువారుతాయని అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కెనాల్ నిర్మాణంపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళనలకు దిగారు.

Read Also: Uttara pradesh: లవర్ కోసం కన్న బిడ్డను హత్య చేసిన తల్లి

Breaking News in Telugu Google news Google News in Telugu Home Minister home Latest News in Telugu Pakistan: Attack Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.