📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Port : పోర్టు కట్టమని USని కోరిన పాక్!

Author Icon By Sudheer
Updated: October 5, 2025 • 8:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ (Pak) ఇటీవల తన దేశంలో భూఖనిజాలను తవ్వేందుకు అమెరికన్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలను అన్వేషించడానికి, తవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయినందున, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం దాని ప్రాధాన్య లక్ష్యంగా మారింది. ఈ క్రమంలోనే ఖనిజాల రవాణా, ఎగుమతులను సులభతరం చేయడానికి పాకిస్తాన్ కొత్త చర్యలకు తెరతీస్తోంది.

Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

తాజాగా వచ్చిన సమాచార ప్రకారం.. గ్వాదర్ జిల్లా పాస్నిలో ఒక పెద్ద పోర్టును నిర్మించి నడపడానికి అమెరికన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది. ఈ అంశంపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సలహాదారులు ఇప్పటికే వైట్ హౌజ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించడమంటే చైనాతో ఉన్న సంబంధాల మధ్య కొత్త సమీకరణలను సూచిస్తుంది. గ్వాదర్ సముద్రతీరంలో చైనా ఇప్పటికే వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మౌలిక వసతులు నిర్మిస్తోంది.

ఈ పోర్టు నిర్మాణం ద్వారా పాకిస్తాన్ ఖనిజాల రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో అమెరికాకు కూడా ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంటుంది. బలూచిస్థాన్‌లో భద్రతా సమస్యలు, చైనా–అమెరికా పోటీ మధ్య ఈ ఒప్పందం ఎంతవరకు సాకారమవుతుందనేది చూడాలి. పాక్ ఆర్థిక అవసరాలు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కలిసొచ్చిన ఈ ఒప్పందం రాబోయే రోజుల్లో ఇండో–పాక్, చైనా–పాక్ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Donald Trump Google News in Telugu Port us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.