అలీమా ఖాన్(Pakistan) మాట్లాడుతూ, ఆసిమ్ మునీర్ భారత్‌తో ఉద్రిక్తతలను పెంచాలని చూస్తున్నారని ఆరోపించారు. మునీర్‌ను “ఛాందసవాద ఇస్లామిస్ట్” గా అభివర్ణించిన ఆమె, ఆయన ఇతర మతాల వారిపై యుద్ధ వాతావరణం సృష్టించాలనుకుంటున్నారని చెప్పారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మాత్రం భారత్‌తో సమగ్ర శాంతి, మంచి సంబంధాలు కోరుకున్నారని, ప్రధాని పదవిలో ఉన్నప్పుడు బీజేపీతో కూడా చర్చలకు సిద్ధత చూపించారని పేర్కొన్నారు. గతంలో పహల్గామ్ దాడి తరువాత భారత సైన్యం చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సందర్భాలను కూడా ఆమె గుర్తుచేశారు.
Read also: విత్తన బిల్లు ఎవరి కోసం?
జైల్లో ఇమ్రాన్‌పై మానసిక హింస?
ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మరో సోదరి ఉజ్మా ఖాన్ ఇటీవల జైలుకు వెళ్లి కలిసిన తరువాత, ఇమ్రాన్‌ను(Pakistan) మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆసిమ్ మునీర్ కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఇమ్రాన్ తమ కుటుంబసభ్యులకు తెలిపినట్లు ఆమె అన్నారు. ప్రభుత్వం, ఆర్మీ కలిసి ఇమ్రాన్‌ను ఒంటరిచేసి ప్రజల గొంతును అణచిపెట్టాలని చూస్తున్నాయని అలీమా ఆరోపిస్తూ, పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుని ఇమ్రాన్‌కు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: