Pakistan Army: బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

Read Time:  1 min
Pakistan Army
Pakistan Army
FONT SIZE
GET APP

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్(Pakistan Army) ప్రావిన్స్‌లో కొనసాగుతున్న భద్రతా ఆపరేషన్లపై పాక్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఘర్షణల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన 216 మంది రెబల్స్‌ను మట్టుబెట్టినట్లు వెల్లడించింది. అలాగే, రెబల్స్‌కు సంబంధించిన కీలక నేతలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

Read Also:Fire Accident: ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం? 

Pakistan Army

ఆపరేషన్‌లో భారీ నష్టం

ఈ సైనిక చర్యల్లో 36 మంది పౌరులు, 22 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘర్షణలు(Pakistan Army) జరిగిన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

బలూచిస్థాన్‌లో కొనసాగుతున్న వేర్పాటువాద పోరాటం

బొగ్గు, బంగారం, తాంబ్రం, సహజ వాయువు వంటి విలువైన ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న బలూచిస్థాన్ ప్రాంతంలో స్వాతంత్య్రం కోసం కొన్నేళ్లుగా వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, రెబల్స్ మధ్య తరచూ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.