📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే?

Author Icon By Saritha
Updated: October 28, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య దాదాపు రెండు సంవత్సరాలపాటు(Pakistan)యుద్ధం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) మధ్యవర్తిత్వం వల్ల రెండుదేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో బంధీల విడుదల జరిగింది. అయితే గాజాలో పాకిస్తాన్ తమ సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో (ఐఎస్ఎఫ్) భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్, ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్, ఈజిప్టులోని అమెరికాకు చెందిన సిఐఎ సీనియర్ అధికారుల మధ్య రహస్య సమావేశాలు జరిగాయి.

Read also: పిల్లల ఆరోగ్యానికి బీట్‌రూట్‌ ఎందుకు అవసరం?

Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే?

గాజాలో మోహరించనున్న పాక్ సైన్యం

పాక్ సైనికులను(Pakistan) గాజాలో మోహరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20వేలమంది సైనికులను అక్కడికి పంపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పాక్ నుంచి అధికార ప్రకటన త్వరలో రానుంది. అయితే పాక్ సైన్యం గాజాలో అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేస్తాయి. అలాగే మానవతా సాయం అందిస్తాయి. పునర్నిర్మాణ సేవలు చేస్తాయి. హమాస్ నేను ఆయుధరహితంగా మార్చడంలో సరిహద్దుల్లో భద్రత బాధ్యతలు చేపట్టనున్నాయి.

బఫర్ ఫోర్స్ గా పనిచేయనున్న పాక్ దళాలు

ఇజ్రాయెల్, గాజాలో మిగిలిన మిలిటెంట వర్గాల మధ్య పాక్ దళాలు బఫర్ ఫోర్స్ గా పనిచేస్తాయని అధికారిక వర్గాలుపేర్కొన్నాయి . ఇలా మోహరించినందుకు బదులుగా ఇజ్రాయెల్, అమెరికా నుంచి పాకిస్తాన్ కు ఆర్థిక ప్రోత్సహకాలు రానున్నాయని సమాచారం. పాక్ సైన్యం ప్రమేయం ఈ విషయంలో సున్నితమైనదని, వ్యూహాత్మకంగా ప్రయోజనం ఏం ఉండదని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ ఈ చర్యతో అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థికసాయంతో గట్టెక్కాలనే ఉద్దేశంతో ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Gaza ISF Israel Hamas Conflict Latest News in Telugu Middle East Pakistan army Pakistan Economy Peacekeeping Forces Telugu News us pakistan relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.