📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Asif Munir: భారత్‌ను అణుబాంబుతో హెచ్చరించిన పాక్‌ ఆర్మీ చీఫ్

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాక్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌(Pak Army Chief Asif Munir) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా(america) నుంచి భారత్‌(India)కు అణుబాంబు బెదిరింపులు చేశారు. భారత్‌ నుంచి పాకిస్థాన్‌ ఉనికికి ముప్పు ఉందని భావిస్తే.. అణుబాంబు సగం ప్రపంచాన్ని ముంచివేస్తుందని హెచ్చరించారు. పాక్‌ సైన్యాధిపతిగా అసిఫ్‌ మునీర్ అమెరికా గడ్డ నుంచి భారత్‌కు అణు బెదిరింపు చేయడం ఇదే మొదటిసారి. టంపాలో నిర్వహించిన బ్లాక్‌టై విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాక్‌ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశమని అన్నారు. తమ దేశం ఉనికి పోతున్నట్లు భావిస్తే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామని పేర్కొన్నారు.

Asif Munir: భారత్‌ ను అణుబాంబు తో హెచ్చరించిన పాక్‌ ఆర్మీ చీఫ్

అమెరికా గడ్డ నుంచి భారత్‌కు అణు బెదిరింపు
అలాగే సింధూ నది అంశాన్ని కూడా ప్రస్తావించారు. భారత్‌ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని.. ఆ తర్వాత 10 క్షిపణులతో దాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు సింధూ నది ఏ భారతీయ కుటుంబానికి చెందిన ఆస్తి కాదన్నారు. మాకు క్షిపణుల కొరత లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు భారత్‌ను హైవేపై నడుస్తున్న మెర్సిడెస్‌ కారుతో, పాకస్థాన్‌ను గులకరాళ్లతో నిండిన చెత్త ట్రక్‌తో పోల్చారు. ట్రక్కు కారును ఢీకొంటే ఎవరికి హాని కలుగుతుందని ప్రశ్నించారు. భారత్‌ తనను తాను విశ్వగురువుగా చూపించాలని కోరుకుంటుందని.. కానీ వాస్తవానికి దీనికి దూరంగా ఉందని మునీర్ అన్నారు.
అమెరికా-పాకిస్థాన్ మధ్య సైనిక సంబంధాలు
మరోవైపు అసీఫ్‌ మునీర్ అమెరికన్ రాజకీయ, సైనికాధికారులతో సహా పాకిస్థాన్ ప్రవాసులను కలిశారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. కురిల్లా నాయకత్వాన్ని మునీర్‌ ప్రశంసించారు. అలాగే అమెరికా-పాకిస్థాన్ మధ్య సైనిక సంబంధాలు పెంపొందించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. సైనిక సహకారం గురించి చర్చించేందుకు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్‌ను కూడా కలిశారు.
ఇరుదేశాల మధ్య చమురు ఒప్పందం
ఇదిలాఉండగా గత రెండు నెలల్లో అసిఫ్ మునీర్‌ అమెరికాకు పర్యటించడం ఇది రెండోసారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చమురు ఒప్పందంతో పాటు అనేక సహకార ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌తో కూడా సంబంధాలు పెంచుకుంటోంది.

 భారత్ పై పాక్ దాడి
2025 ఏప్రిల్ 22న, ఐదుగురు ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణం నుండి 7 కి.మీ (4.3 మైళ్ళు) దూరంలో ఉన్న బైసారన్ లోయ గడ్డి మైదానంలోకి ప్రవేశించారు.
ప్రారంభ జీవితం,విద్య
మునీర్ 1968లో పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాడు[9][10], వారి మూలాలు భారతదేశంలోని పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్నాయి, అతని తల్లిదండ్రులు 1947 భారతదేశ విభజన తర్వాత అక్కడి నుండి వలస వచ్చారు. వారు రావల్పిండిలోని ధేరి హస్సనాబాద్‌లో స్థిరపడటానికి ముందు తోబా టేక్ సింగ్‌కు వెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/turkey-earthquake-6-1-magnitude/international/528649/

Army Chief Defence india Indo-Pak tensions Latest News Breaking News Nuclear Threat Pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.