పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన దేశాల మధ్య యుద్ధానికి స్థానం లేదని చెప్పిన ఆయన, భారత మిలిటరీ నాయకత్వాన్ని నేరుగా హెచ్చరించారు. “రెచ్చగొట్టే చర్యలు చేపడితే ఊహించని స్థాయిలో ప్రతిస్పందన ఇస్తాం. దాంతో ఏర్పడే మిలిటరీ, ఆర్థిక నష్టాలను అంచనా వేయడం కూడా సాధ్యం కాద”ని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పాక్‌లో కొనసాగుతున్న అంతర్గత అస్థిరత, రాజకీయ ఒత్తిడిని దాచిపెట్టే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కశ్మీర్ అంశంపై పాక్ మళ్లీ అంతర్జాతీయ వేదికల్లో రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Latest news: Viral fever: విష జ్వరాలతో మంచాన పడ్తున్న గురుకులాలు
పాకిస్థాన్ సైన్యం చరిత్రపరంగా దేశ రాజకీయ వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతోంది. అంతర్గత రాజకీయ వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభాలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆ దేశ సైనిక నాయకత్వానికి అలవాటుగా మారింది. ప్రస్తుతం పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. IMF షరతులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఉగ్రవాద దాడులు దేశంలో అసంతృప్తి పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంపై కఠిన వ్యాఖ్యలు చేయడం ద్వారా పాక్ సైన్యం దేశీయ మద్దతు సాధించే ప్రయత్నం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ మాత్రం ఎప్పటిలానే శాంతి, అభివృద్ధిని ప్రాధాన్యంగా ఉంచుతూ, అంతర్జాతీయ స్థాయిలో బాధ్యతాయుత ధోరణిని ప్రదర్శిస్తోంది. భారత్ తరఫున ఎలాంటి హోసి చర్యలు జరగలేదని, కేవలం అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసమేనని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే సామర్థ్యం కలిగిన శక్తివంతమైన దేశమని ఇప్పటికే నిరూపించింది. పాక్ నిజంగా శాంతి కోరుకుంటే, సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు నిలిపి, పరస్పర గౌరవం, అంతర్జాతీయ నిబంధనల పరిధిలో సంభాషణ జరపడం ద్వారా సమస్యల పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. అంతేకాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమస్యలు మరింత పెరగడం తప్ప వేరే లాభం ఉండదు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/