📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Pakistan: ఎయిర్ లైన్స్ అమ్మకంతో రుణాలు చెల్లించేందుకు పాక్ యత్నం

Author Icon By Vanipushpa
Updated: December 4, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్(Pakistan) గత కొన్నేళ్ళుగా ఆర్థికపరంగా సతమతమౌతోంది. బయటకు ఎక్కడా ఇది కనిపించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఎప్పటికప్పుడు ఆ దేశం బీదతనం, తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయపటడేసేందుకు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణం కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ లోపు అప్పులను తీర్చేందుకు పాకిస్తాన్ తన కీలకమైన ఎయిర్‌లైన్స్‌ను అమ్మకానికి పెట్టింది. ఐఎంఎఫ్ షరతుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పీఐఏ విక్రయం అనేది గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది.

 Read Also: మోదీని కలవడానికి ఢిల్లీకి పుతిన్ ఎందుకు వస్తున్నారు?

pakistan

షెహబాజ్ షరీఫ్ ప్రకటన విడుదల

ఎయిర్ లైన్స్ అమ్మకం గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం పీఐఏబిడ్డింగ్ 2025, డిసెంబర్‌ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐఎంఎఫ్‌ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించనున్నారు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ. 86 బిలియన్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు. మరోవైపుపీఐఏ దశాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయి ఉంది. నిర్వహణ లోపాలు, పైలెట్ లైసెన్స్ కుంభకోణంతో ఇది కుదేలయిపోయి ఉంది.

విక్రయం ఆసిమ్ మునీర్ కోసమేనా?
ఈ ఎయిర్ లైన్స్ అమ్మకం లోనూ, దాని ద్వారా వచ్చే ఆదాయం విషయంలోనూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్మునీర్ హస్తం ఉందని తెలుస్తోంది. బిడ్డింగ్ కు అర్హత పొందిన నాలుగు సంస్థల్లో ఒకదానితోఆసిమ్ కు సంబంధాలున్నాయి. ఆ నాలుగింటిలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్‌లో భాగం. ఇందులో క్వార్టర్‌మాస్టర్ జనరల్ (క్యూఎంజీ)నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆసిమ్మునీర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Breaking News in Telugu Debt Repayment Economic Reform Google News in Telugu Government Policy Latest In telugu news Pakistan Airlines Pakistan Economy PIA Sale

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.