📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం

Latest Telugu News: Pak vs Afgh: పాకిస్థాన్​- అఫ్గాన్ మధ్య దాడులు – సరిహద్దుల్లో హై అలర్ట్‌

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాయువ్య సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దళాల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యా యి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని పాకిస్థాన్ అధికారులు ఆరోపించారు. అయితే పాక్​ సైన్యం వెంటనే ప్రతిస్పందించినట్లు స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఇది ఈ వారంలో జరిగిన రెండో ఘటన.అఫ్గాన్​ చేసిన దాడులకు తాము ప్రతిదాడు లు చేసినట్లు పాక్ భద్రతాధికారులు వెల్లడించారు. అఫ్గాన్ సైనిక స్థావరాలు, ట్యాంకులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. అఫ్గాన్‌ దళాలు, తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ (టీటీపీ) ఉగ్రవాదులతో కలిసి తమ భూభాగంలోని సైనిక పోస్ట్‌లపై కాల్పులు జరిపాయని వివరించారు.

Read Also: Trump: నా జుట్టు ఏది?..టైమ్‌ మ్యాగజైన్‌పై ట్రంప్ ఆగ్రహం

Pak vs Afgh: పాకిస్థాన్​- అఫ్గాన్ మధ్య దాడులు – సరిహద్దుల్లో హై అలర్ట్‌

అఫ్గాన్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌

ఆ దాడులకు పాక్​ సైన్యం వెంటనే ప్రతిస్పందించిందని పేర్కొన్నారు. టీటీపీ శిక్షణ కేంద్రాన్ని కూడా నాశనం చేశామని తెలిపారు. ప్రస్తుతం అఫ్గాన్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌లో ఉన్నట్లు పాకిస్తాన్ సైన్యం వివరించింది. మరోవైపు అఫ్గానిస్థాన్‌ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించింది. అఫ్గాన్‌లో ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోని డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్‌ అహ్రర్‌, దాడులు జరిగినట్లు అంగీకరించారు. మరోవైపు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫ్లజ్‌(JUI-F) స్పందించింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. గతంలో పాక్‌-అఫ్గాన్‌ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయూఐ-ఎఫ్ చీఫ్‌ మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ తెలిపారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని చెప్పారు.

25 పాక్​ ఆర్మీ పోస్ట్​లను స్వాధీనం

అక్టోబర్​ 12న పాకిస్థాన్‌ – అఫ్గానిస్థాన్‌ బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పాక్‌ సైనికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖైబర్‌-పఖ్తుంక్వా, బలూచిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్టు అఫ్గానిస్థాన్ అధికారులు పేర్కొన్నారు. 25 పాక్​ ఆర్మీ పోస్ట్​లను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఖతార్, సౌదీ అరేబియా విజ్ఞప్తులతో శనివారం అర్ధరాత్రి ఆపరేషన్‌ను ఆపరేషన్​ను నిలిపివేసినట్లు తెలిపారు. పాకిస్థాన్‌ ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని అంగూర్, అడ్డా, బాజార్, కుర్రం, దిర్, చిత్రాల్, బలోచిస్థాన్‌లోని బారంచా పోస్టులపై అఫ్గాన్‌ విరుచుకుపడింది.

పాక్‌ తప్ప, పొరుగుదేశాలన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయి

పలు ఆయుధాలను, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గత గురువారం తమ దేశంపై పాకిస్థాన్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామని అఫ్గాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. పాక్‌ తప్ప, పొరుగుదేశాలన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయని అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ ఉద్రిక్తతలపై స్పందించారు. తమకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదని, అఫ్గాన్‌లో శాంతి ఉందని పేర్కొన్నారు. పాక్‌ మాత్రమే మా పొరుగుదేశం కాదని, మరో ఐదు దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Afghanistan tensions border clashes border security news cross-border attacks Latest News Breaking News Pakistan Afghanistan conflict Pakistan security alert Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.